ETV Bharat / city

'ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సర్కారు సిద్ధం..' - సీఎం కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష

cm kcr high level review on the situation of rains and floods in the state

author img

By

Published : Jul 11, 2022, 2:20 PM IST

Updated : Jul 11, 2022, 10:17 PM IST

14:19 July 11

రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

CM KCR Review on Rains: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2, 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెల్లొద్దని ప్రజలకు సీఎం కేసీఆర్​ సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులను సీఎం తెలుసుకుంటున్నారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్​ ఆరా తీస్తున్నారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

"భారీ వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 2, 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రజలు అధికారులకు సహకరించాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెల్లొద్దు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు సిద్ధం చేయాలి. జీహెచ్ఎంసీ, మున్సిపల్ ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు సిద్ధం చేయాలి." - సీఎం కేసీఆర్​

ఇవీ చూడండి:

Last Updated : Jul 11, 2022, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.