ETV Bharat / state

CM KCR Focus on Drugs Control: పోలీసులు, ఆబ్కారీ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమావేశం - తెలంగాణ వార్తలు

CM KCR high-level meeting with police and excise officials on Drugs trafficking prevention, CM KCR REVIEW 2021
పోలీసులు, ఆబ్కారీ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమావేశం, కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం 2021
author img

By

Published : Oct 20, 2021, 12:42 PM IST

Updated : Oct 20, 2021, 1:05 PM IST

12:38 October 20

డ్రగ్స్‌ రవాణా అరికట్టే వ్యూహంపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చ

రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్... ఎక్సైజ్‌, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాల కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై... అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. జిల్లాల్లో పరిస్థితులు, చేపట్టిన చర్యల నివేదికలతో అధికారులు సమావేశానికి హాజరయ్యారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యచరణ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. డ్రగ్స్‌ విక్రయాలు అరికట్టే చర్యలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. ఈ భేటీలో మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.  

కఠిన చర్యలు తీసుకునేలా..

జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో జిల్లా ఎక్సైజ్(CM KCR meeting on drugs issue) శాఖాధికారులు హాజరయ్యారు. మాదకద్రవ్యాల బారిన పడి యువత నిర్వీర్యం కాకూడదనే లక్ష్యంతో సమావేశంలో కార్యాచరణను రూపొందించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను(CM KCR meeting on drugs issue) ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ సమర్థవంతంగా జరిగేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుందని కేసీఆర్(CM KCR meeting on drugs issue) ఇదివరకే తెలిపారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్ఠంగా అమలు చేసిందని వివరించారు. ఇటీవల దేశవ్యాప్తంగా పెచ్చురిల్లుతున్న డ్రగ్స్ కల్చర్ కారణంగా రాష్ట్రంలో కఠిన చర్యలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

యథేచ్చగా కేసులు..

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయిని హైదరాబాద్‌ కేంద్రంగా పలు రాష్ట్రాలకు ముఠాలు తరలిస్తున్నాయి (Growing ganja sales in Hyderabad). నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 78 కేసుల్లో 121 మందిని అరెస్టు చేసిన పోలీసులు... 14 వందల కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ తరచూ గంజాయి పట్టివేత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి (Growing ganja sales in Hyderabad). ఎక్సైజ్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా... నిత్యం మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో గంజాయి విక్రయం, సరఫరా పెరగడంతో వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించేదుకు సిద్ధమైంది. మాదకద్రవ్యాల నియంత్రణపై ఎక్సైజ్‌, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చర్చిస్తున్నారు.

ఇదీ చదవండి: CM KCR meeting on drugs: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం..

Last Updated : Oct 20, 2021, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.