ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​ మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత

Former Chhattisgarh chief minister Ajit Jogi suffered a cardiac arrest for the third time on Friday and his condition is said to be critical.

jogi
ఛత్తీస్​గఢ్​ మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత
author img

By

Published : May 29, 2020, 3:44 PM IST

Updated : May 29, 2020, 6:07 PM IST

15:42 May 29

అజిత్ జోగి అస్తమయం

ఛత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి(74) మరణించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నేడు తుది శ్వాస విడిచారు.

మే 9న అజిత్ జోగికి గుండెపోటు రాగా... రాయ్​పుర్​లోని శ్రీ నారాయణ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటినుంచి వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించారు. అయినా మరో 2 సార్లు గుండెపోటు వచ్చింది. వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు.

ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన జోగి 1986లో కాంగ్రెస్​లో చేరారు. పార్టీలో, ప్రభుత్వంలో పలు కీలక పదవులు చేపట్టారు. ఛత్తీస్​గఢ్ తొలి సీఎంగా పనిచేసిన ఆయన 2016లో కాంగ్రెస్​ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆయన కుమారుడు అమిత్ జోగి ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు.

వెంకయ్య, మోదీ విచారం

అజిత్ జోగి మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. జోగి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. పేదలు, ముఖ్యంగా గిరిజనుల జీవితాల్లో సకారాత్మక మార్పు తెచ్చేందుకు అజిత్ ఎంతో కృషి చేశారని కొనియాడారు మోదీ.

Last Updated : May 29, 2020, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.