Nara Bhuvaneswari reacts to AP Assembly Incident : ఏపీ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. తనపై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదని అన్నారు. కష్టాల్లో తనకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు. ఈ మేరకు భువనేశ్వరి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మానాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదని ఆశిస్తున్నాను’’.
- నారా భువనేశ్వరి, చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ