Young man died while making Insta Reels: రీల్స్ సరదా.. ఆ యువకుడి ప్రాణాలు తీసింది. ఇన్‌స్టా రీల్స్ చేద్దామని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లాడు. రీల్స్ చేస్తూ వెనక వస్తున్న రైలును గమనించలేదు. దీంతో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్ నగర్‌కు చెందిన మదర్సా విద్యార్థి మహ్మద్ సర్ఫరాజ్(16) సనత్ నగర్‌లోని రైల్వే లైన్ సమీపంలో ఇన్‌స్టా రీల్స్ రికార్డ్ చేయడానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్‌పై వీడియో తీస్తుండగా.. వెనక నుంచి వచ్చిన రైలు సర్ఫరాజ్‌ను ఢీ కొట్టింది. దీంతో సర్ఫరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్పాట్లో మృతుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రైల్వేట్రాక్‌పై ఇన్‌స్టా రీల్స్ చేస్తూ యువకుడు మృతి - sarpraj died
19:23 May 05
మృతుడు సర్ఫరాజ్‌గా గుర్తింపు