రాష్ట్రంలో ఇవాళ 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసులు 1275 కి చేరాయి. ఇవాళ 50 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కోలుకున్న మొత్తం సంఖ్య 801కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 444 మందికి కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 30 మంది మృతి చెందారు.