రాష్ట్రంలో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి తాజాగా మరో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,57,876 మందికి వైరస్ సోకింది. వైరస్‌తో 1,407 మంది మృతి చెందారు.
కరోనా నుంచి కొత్తగా 1,539 మంది కోలుకోగా... ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,42,084 మందికి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 14,385 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 11,948 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 141 మందికి కరోనా నిర్ధరణ అయింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 72 కరోనా కేసులను గుర్తించారు.