ETV Bharat / bharat

పిల్లలకు కరోనా టీకా ధరపై కీలక ప్రకటన- మూడు డోసులకు కలిపి... - జైడస్​ క్యాడిలా వార్తలు తాజా

కరోనా టీకా ధరపై కేంద్రానికి ఓ ప్రతిపాదన చేసింది (Zycov-D Vaccine Price) జైడస్​ క్యాడిలా సంస్థ. మూడు డోసులకు రూ.1900 చెల్లించాలని కోరింది. అయితే.. ఈ ధర తగ్గింపుపై కేంద్రం ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

zydus cadila vaccine
వ్యాక్సిన్​ ధర ప్రకటించిన జైడస్​ క్యాడిలా.. ఎంతంటే?
author img

By

Published : Oct 3, 2021, 5:58 PM IST

Updated : Oct 3, 2021, 6:44 PM IST

పెద్దలు, 12 ఏళ్ల దాటిన వారి కోసం రూపొందించిన కరోనా వ్యాక్సిన్​ ధరపై (Zycov-D Vaccine Price) జైడస్​ క్యాడిలా కేంద్రానికి ఓ ప్రతిపాదన చేసింది. మూడు డోసులకు కలిపి రూ.1900 వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ధర తగ్గింపు కోసం కేంద్రం.. సంబంధిత సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

వ్యాక్సిన్​ ధరకు సంబంధించి (Zycov-D Vaccine Price) ఈ వారంలో కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే అంత ధర..

జైకొవ్​-డి వ్యాక్సిన్​కు ఉపయోగించే ఇన్​జెక్టర్​ ధరే రూ.30వేలు ఉంటుందని.. అందుకే కొవాగ్జిన్, కొవిషీల్డ్​ కన్నా ఎక్కువ ధరను సంస్థ ప్రతిపాదించిందని ఓ అధికారి వెల్లడించారు.

జైకొవ్‌-డి వ్యాక్సిన్‌ దేశీయ పరిజ్ఞానంతో తయారైన రెండో టీకా. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. ఈ టీకాను నేరుగా (Zycov D Vaccine Dose) చర్మంలోకి ఎక్కిస్తారు. ఇందుకోసం సూది అవసరం ఉండదు. నొప్పి లేకుండా ఫార్మాజెట్‌ అనే సాధనం ద్వారా దీన్ని ఎక్కిస్తారు.

వ్యాక్సిన్​ కోసం జైడస్​ రూపొందించిన ఈ జెట్​ ఇన్​జెక్టర్​ ద్వారా 20వేల డోసులు అందించొచ్చు. ఈ టీకాను మూడు విడతల కింద 0, 28, 56 రోజులకు తీసుకోవాలి.

ఇదీ చూడండి : 'పిల్లలకు త్వరలోనే కరోనా టీకా.. వారికే ప్రాధాన్యం'

Last Updated : Oct 3, 2021, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.