Zero Shadow Day: మనిషికైనా వస్తువుకైనా నీడ ఎల్లప్పుడు ఉంటుంది. దానికి నీడ లేకుండా ఎప్పుడైనా చూశారా అంటే కాదనే చెప్తాం. ప్రతిదానికి వెలుగులో నీడ తప్పనిసరిగా ఉంటుంది. సూర్యకిరణాలు భూమి మీద పడే కోణాన్ని బట్టి నీడ పడే కోణం మారుతుంది. ఉదయించినప్పుడు ఒకలా కనిపిస్తుంది. మధ్యాహ్నం నడి నెత్తిపై పడినప్పుడు ఒకలా, సూర్యుడు అస్తమించే సమయంలో ఇంకోలా నీడ కోణం మారుతుంది. కానీ అసలు నీడ పడకుండా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూశారా..? లేదే అంటారా..? అయితే ఇవాళ మీ నీడను చూసుకోకుండా ఉండొచ్చు. అదెలా అంటారా..? ఇవాళ మధ్యాహ్నం ఓ రెండు నిమిషాల పాటు ఎండలో మీ నీడ మాయమైయింది. అసలు ఈ నీడ స్టోరీ ఏంట్రా బాబు అనుకుంటున్నారా..? పదండీ అసలు కథ తెలుసుకుందాం.
Zero Shadow Day in Hyderabad : హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజు అరుదైన జీరోషాడో ఆవిష్కృతం అయింది. ఇవాళ మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు అనగా రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయమైంది. ఇందుకు కారణం సూర్యుడు కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల జరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా అంటే (90 డిగ్రీలు) ఏదైనా వస్తువును ఉంచితే దానిపైనా రెండు నిమిషాలు నీడ కనిపించదు అని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అలా చాలా మంది మధ్యాహ్నం 12.00 గంటలు కాగానే మేడమీదకు వెళ్లి 12.12 గంటల సమయంలో నీడ కనిపిస్తుందా లేదా అని పరీక్షించారు. నిజంగానే నీడ కనిపించకపోయేసరి ఆశ్చర్యపోయారు. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసి సంబురపడ్డారు.
రోజూ వేరు ఈరోజూ వేరు: రోజూ సూర్యుడు మధ్యాహ్నం తలమీదుగా వెళ్తున్నట్టు కనిపించిన జీరో షాడో ఉండదని అధికారులు తెలిపారు. భూమి గోళాకారంగా ఉండటం కారణంగా సూర్యకిరణాలు మధ్యాహ్నం సరికి భూమధ్య రేఖపై మాత్రమే పడతాయి. అందువల్ల ఉత్తరాన, దక్షిణాన నేరుగా పడే అవకాశం లేదని వివరించారు. సూర్యుడి గమనం ఉత్తరాయణంలో 6 నెలలు ఉత్తర దిశగా ఉంటుంది. దక్షిణాయణంలో 6 నెలలు దక్షిణ దిశగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో భూమి సుమారు 23.5 డిగ్రీలు వంపు ఉంటుంది. ఇందువల్ల భూమధ్య రేఖకు అన్ని డిగ్రీల్లో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సూర్యుడు మధ్యాహ్నం నేరుగా తల మీదుగా వెళ్తాడని తెలిపారు. ఉత్తరాయణంలో ఇలా ఒకసారి, దక్షిణాయణంలో ఒకసారి జరుగుతుందని అన్నారు. ఏడాదికి రెండులసార్లు జీరోషాడో మూవ్మెంట్ ఉంటుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: