ETV Bharat / bharat

నారా లోకేశ్‌ యువగళం విజయోత్సవ సభకు సర్కారు ఆంక్షలు - విజయవంతం చేస్తామని నేతలు ధీమా - యువగళం పాదయాత్ర ముగింపు సభ

Yuva Galam Vijayotsava Sabha Today: యువగళం-నవశకం భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఏపీలోని విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహిస్తున్న యువగళం విజయోత్సవ సభకు తెలుగుదేశం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం పసుపుమయమైంది. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నాయకులు, నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ వేదిక పై నుంచే సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖారావం పూరించేందుకు టీడీపీ-జనసేన సిద్ధమయ్యాయి. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరు పార్టీల అధినేతలు ఒకే బహిరంగ వేదికను పంచుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రణాళికపై ఇరుపార్టీ నేతలు ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

Yuva_Galam_Vijayotsava_Sabha_Today
Yuva_Galam_Vijayotsava_Sabha_Today
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 7:09 AM IST

Updated : Dec 20, 2023, 12:27 PM IST

నారా లోకేశ్‌ యువగళం విజయోత్సవ సభకు సర్కారు ఆంక్షలు - విజయవంతం చేస్తామని నేతలు ధీమా

Yuva Galam Vijayotsava Sabha Today : తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ "యువగళం-నవశకం" పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభకు విజయనగరం జిల్లా పోలిపల్లి సిద్ధమైంది. ఇందుకోసం 200 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 600 మందికి పైగా ముఖ్య నాయకులు ఆసీనులయ్యేందుకు వీలుగా 156 అడుగుల వెడల్పు, 64 అడుగుల పొడవుతో భారీగా సభా వేదికను నిర్మించారు. దూరంగా ఉన్నవారికి కనిపించేలా అతి పెద్ద ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.

All Set For Yuva Galam Vijayotsava Sabha : తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మొత్తంగా 16 కమిటీలను ఏర్పాటు చేసి పనులను పూర్తి చేశారు. సభకు హాజరయ్యేవారికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా 2 వేల మంది వాలంటీర్లు సేవలు అందించనున్నారు. సభకు హాజరయ్యే వారికి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. 150 మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దాదాపు 6 లక్షల మంది సభకు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో తెలుగుదేశం భారీగా ఏర్పాట్లు చేసింది.

Nara Lokesh Interview: రాష్ట్రం మేలు కోసం టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలి: నారా లోకేశ్​

Pawan Kalyan Attends in Yuvagalam Vijayotsava Sabha : సభకు వచ్చే వారికి క్యూఆర్ కోడ్ తో కూడిన పాసులు అందించారు. సభా వేదికపై టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన అత్యంత ముఖ్యమైన నాయకులకు ప్రోటోకాల్ ప్రకారం స్థానాలు కేటాయించారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్​తో కూడిన ఆహ్వాన పత్రాలను అందజేశారు. సభా వేదికకు కుడివైపున తొలి వరసలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు, వీవీఐపీలు, వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఎడమ వైపున యూనిట్ ఇన్ఛార్జీలు, పోలింగ్ కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లు, కుటుంబ సాధికార సమితి సభ్యులు తదితరులు కూర్చొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నారా, నందమూరి కుటుంబ సభ్యులు పోలిపల్లి సమీపంలోని రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, నేరుగా రిసార్ట్స్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

Yuva Galam Vijayotsava Sabha in Vizianagaram District : భోగాపురం నుంచి విశాఖ వెళ్లే ప్రధాన మార్గమంతా పసుపుమయమైంది. ఎటు చూసినా భారీ హోర్డింగులు, కటౌట్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన జెండాలు, తోరణాలు రోడ్డుకు ఇరువైపుల ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో భారీగా పసుపు బెలూన్లు ఎగురవేశారు. తొలుత విశాఖలో బహిరంగ సభ నిర్వాహణకు తెలుగుదేశం నేతలు అనుమతి కోరగా పోలీసులు నిరాకరించారు. చివరకు పోలిపల్లిలోని ఓ ప్రైవేటు స్థలంలో సభ ఏర్పాటు చేసుకున్నా సవాలక్ష ఆంక్షలతో అనుమతిచ్చారు.

నిర్బంధాలను అధిగమించి జనగళమై సాగిన యువగళం - యువనేత లోకేశ్ పాదయాత్ర మైలురాళ్లెన్నో!

Nara Lokesh Yuvagalam Padayatra Closing Ceremony : ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వాలని గతంలోనే కోరినా అనుమతివ్వలేదు. ప్రైవేటు బస్సులు ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు. సభకు భారీగా శ్రేణులు హాజరవుతారని తెలిసినా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీయే వాలంటీర్లను సిద్ధం చేసి విధులు కేటాయించింది. పార్కింగ్ కోసం 250 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అనంతపురం, చిత్తూరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి రాజాపులోవ వద్ద, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చే వారికి ఇంజినీరింగ్ కళాశాల వైపు నుంచి వచ్చేలా పార్కింగ్ ఏర్పాటు చేశారు.

Nara Lokesh Concludes Yuvagalam Padayatra : యువగళం-నవశకం సభను విజయవంతం చేసేందుకు టీడీపీ-జనసేన శ్రేణులు భారీగా పోలిపల్లికి తరలివెళ్లారు. ఇందుకోసం ఏడు ప్రత్యేక రైళ్లను తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. చిత్తూరు, తిరుపతి, రైల్వేకోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రత్యేక రైళ్లలో పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవ సభకు బయల్దేరారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కేటాయించకపోయినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా వారి వాహనాల్లో సభకు తరలివెళ్లారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం- నవశకం సభను విజయవంతం చేసి తీరుతామని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.

'వంద రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వమే - యువగళం సభ ద్వారా ఏపీకి దశ, దిశ ఇవ్వబోతున్నాం'

Last Updated : Dec 20, 2023, 12:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.