ETV Bharat / bharat

వైఎస్సార్సీపీ నాలుగో జాబితాపై నేతల్లో ఆందోళన - ఈ సారి కరివేపాకులు ఎవరో? - YSRCP 4th List

YSRCP Candidates Fourth List: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ల నాలుగో జాబితాను పార్టీ సిద్దం చేస్తుందన్న ప్రచారంతో వైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ప్రకటించిన మూడు జాబితాల్లో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడంతో నాలుగో లిస్టులో ఇంకెంత మంది టికెట్లు గల్లంతు అవుతాయోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. సీట్లు దక్కించుకున్న వారు సీఎంకు, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు చెబుతుండగా మెడపై కత్తి వేలాడుతోన్న వారంతా తాడేపల్లికి క్యూ కడుతున్నారు. తమ సీటు విషయమై ఆరా తీసి పార్టీ మఖ్యనేతలను కలసి ప్రసన్నం చేసుకుంటున్నారు. వచ్చే జాబితాలో తమ పేర్లు గల్లంతు కాకుండా చూడాలని మొరపెట్టుకుంటున్నారు.

YSRCP_Candidates_Fourth_List
YSRCP_Candidates_Fourth_List
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 8:46 AM IST

వైఎస్సార్సీపీ నాలుగో జాబితాపై నేతల్లో ఆందోళన - ఈ సారి కరివేపాకులు ఎవరో?

YSRCP Candidates Fourth List : ఏపీలో 51 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లను మార్చుతూ వైఎస్సార్సీపీ విడుదల చేసిన జాబితాలతో ఆ పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మూడు జాబితాల్లో కలిపి ఇప్పటి వరకు 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించిన సీఎం జగన్ ముగ్గురు ఎంపీలను పక్కన పెట్టేశారు. దీంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. తమను తీవ్ర అన్యాయంచేశారని, నమ్మించి మోసం చేశారంటూ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రగిలి పోతున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు. ఇతర పార్టీల్లోకి టచ్‌లోకి వెళ్తున్నారు. వీరిని నిలువరించి,పార్టీని రక్షించుకోవడం, వైకాపా పెద్దలకు తలనొప్పిగా మారింది.

YSRCP 4th List : ఇదిలా ఉండగా నాలుగో జాబితా సిద్ధం చేస్తున్నారన్న ప్రచారంతో పలు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మార్పులు చేస్తున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమ సీటు ఉంటుందా? ఊడుతుందా? అని తెలుసుకునేందుకు పార్టీ పెద్దలను, ఐప్యాక్ టీంలను ఆశ్రయిస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు పనులు కోసమని చెబుతూ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు. సీట్లు కోల్పోయిన వారు సైతం తమకు న్యాయం చేయలని క్యాంపు కార్యాలయానికి వచ్చి నేతలను, సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వైఎస్సార్సీపీలో ప్రకంపనలు - అధిష్ఠానం నిర్ణయంపై నిరసన జ్వాలలు

న్యాయం చేయండీ సారూ : గురువారం ప్రకటించిన జాబితాలో ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను తప్పించారు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే సీటు ఇస్తామని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. దీంతో తన పరిస్ధితి ఏమిటని మద్ది శెట్టి వేణుగోపాల్‌ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసిన ఆయన తన సీటు విషయమై చర్చించారు. దర్శినుంచి తప్పిస్తున్నానని, మరో సీటు చూస్తానన్న సీఎంఎక్కడ అనే విషయం స్పష్టం చేయలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

రాజకీయ భవిష్యత్ కార్యాచరణ : పార్టీ ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం పొలిటికల్ కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలసి తన ఆవేదన తెలిపారు. సీఎం చెప్పినట్లు తనకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. ఒంగోలు ఎంపీ లేదా ఏదేనా అసెంబ్లీ స్థానానికి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు. సీటు ఉంటుందా లేదా అనే విషయమై స్పష్టమైన హామీ రాకపోవడంతో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే విషయమై మద్ది శెట్టి వేణుగోపాల్ ఆందోళన చెందుతున్నారు.

వైఎస్సార్సీపీలో ముగిసిన మార్పులు చేర్పుల పర్వం- సిట్టింగులకు జగన్ మొండిచేయి

పర్చురు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఆమంచి కృష్ణమోహన్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. చీరాల నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమంచి తిరిగి అదే స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. వైసీపీ మాత్రం ఆయన్ను పర్చూరు చూసుకోవాలని పంపేసింది. తన సోంత నియోజకవర్గం చీరాల నుంచి తప్పించి పర్చూరు ఇన్‌ఛార్జ్‌గా నియమించిన నాటినుంచి అసంతృప్తితో ఉన్న ఆమంచి తిరిగి చీరాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాడేపల్లికి వచ్చిన ఆయన పార్టీ పెద్దలను కలవడం చర్చనీయాంశం అయ్యింది.

అసంతృప్తిలో నేతలు : గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీ మద్దతిచ్చారు. దీంతో చీరాల ఇన్‌చార్జ్‌గా ఆయన కుమారుడు వెంకటేష్‌ను వైసీపీ ప్రకటించింది. ఇప్పుడు ఆమంచి చీరాల కోసం పట్టుబట్టడం వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ సజ్జలను కలసి కోరారు. చీరాలను ఆమంచికి ఇచ్చే విషయమై నేతల నుంచి హామీ రానట్లు తెలిసింది. దీంతో ఆయన అసంతృప్తిగానే తాడేపల్లి నుంచి నియోజకవర్గానికి వెళ్లిపోయారు.

సర్వే రిపోర్టు ఆశాజనకంగా లేదు : నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌ రెడ్డి సైతం రెండు రోజులుగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ సారి గంగుల సర్వే ఆశాజనకంగా లేదని నివేదకలు ఉన్నాయని, ఈ స్థానంలో మార్పులు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. బ్రిజేంద్ర స్థానంలో ఆయన తండ్రి గంగుల ప్రభాకర్‌రెడ్డికి సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఇదే విషయమై ఆరా తీయడం సహా ముఖ్యనేతలను కలసి ప్రసన్నం చేసుకునేందుకు ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తమ కుటుంబానికే సీటు కేటాయించాలని సీఎం పొలిటికల్‌ కార్యదర్శి ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి కోరినట్లు తెలిసింది. దీనిపై సీఎం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ వచ్చినట్లు తెలిసింది. సర్వే రిపోర్టు ఆశాజనకంగా లేదని తెలుసుకున్నకృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తాడేపల్లికి పరుగు పెట్టారు. ముఖ్యనేతలను కలసి తన సీటు విషయమై ఆరా తీశారు. తనకు అన్యాయం చేయవద్దని కోరుతూ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

వేటు వేస్తారేమోనని నేతల్లో ఆందోళన : సంక్రాంతి పండుగ తర్వాత నాల్గవ జాబితా ఉంటుందని వైసీపీ నేతలే చెబుతున్నారు. దీంతో పలువురు నేతల్లో టెన్షన్‌ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే 24మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించినందున, మరెంత మందిపై వేటు వేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.

వైఎస్సార్సీపీలో గొంతెత్తి ప్రశ్నిస్తే - వేటేస్తారు జాగ్రత్త సుమీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.