ETV Bharat / bharat

YS Sharmila on YSRTP Merger With Congress : 'పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయి' - తెలంగాణ కాంగ్రెస్‌

YS Sharmila on YSRTP Merger With Congress
YS Sharmila
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 1:32 PM IST

Updated : Sep 2, 2023, 2:40 PM IST

13:26 September 02

YS Sharmila on YSRTP Merger With Congress

  • నేడు వైయస్ఆర్ గారి 14వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులు అర్పించడం జరిగింది. నాన్న దూరమై పద్నాలుగేళ్లు అవుతున్నా మనందరి గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. నా ప్రతి నిర్ణయం, నా ప్రతి అడుగులో నాన్నను తలుచుకుంటాను. వైయస్ఆర్ గారిని ప్రేమించే ప్రతి… pic.twitter.com/afy0cl4DE7

    — YS Sharmila (@realyssharmila) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

YS Sharmila on YSRTP Merger With Congress : కేసీఆర్ అవినీతి పాలను అంతమెందించేందుకు కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో సుదీర్ఘంగా చర్చించినట్లు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన ప్రతి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పార్టీ విలీనంపై చర్చలు తుది దశకొచ్చాయని వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి(YSR Death Anniversary) సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలో తండ్రి విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల... తన తండ్రిపై వారికి గౌరవముందని నిర్ధారించుకున్న తర్వాతే సోనియా, రాహుల్​తో చర్చల వరకు వెళ్లినట్లు చెప్పారు.

బీఆర్ఎస్ దాడులకు భయపడను: వైఎస్‌ షర్మిల

"పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుదిదశకు వచ్చాయి. వైఎస్ఆర్ లేని లోటు ఈరోజుకు తెలుస్తోందని సోనియా, రాహుల్ ఆకాశానికెత్తారు. వైఎస్ పేరును ఎఫ్​ఐఆర్​లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే.. తెలిసి చేసిన తప్పు కాదు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని సోనియా, రాహుల్ నాతో అన్నారు. కేసీఆర్ అవినీతి పాలను అంతమెందిచటానికే సోనియాతో చర్చలు జరిపాను. కేసీఆర్​ను గద్దె దించే అంశంపై సో‌నియా, రాహుల్​తో సుదీర్ఘంగా చర్చించాను. మా కేడర్, లీడర్స్​తో మాట్లాడాక విలీనంపై ప్రకటన చేస్తాను." వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు

YS Sharmila Meet With Sonia Gandhi and Rahul Gandhi : వైఎస్‌ఆర్‌పై తమకు అపారమైన గౌరవం ఉందని సోనియా, రాహుల్‌ చెప్పారని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. అలాంటిది తాము వైఎస్‌ కుటుంబానికి ఎందుకు ద్రోహం చేస్తామని ప్రశ్నించారు. వైఎస్సాఆర్‌ లేనిలోటు ఈరోజుకు కూడా తమకు తెలుస్తోందని వారు అన్నట్లు షర్మిల పేర్కొన్నారు. దిల్లీలో సోనియా, రాహుల్‌తో చర్చలు సుదీర్ఘంగా, సానుకూలంగా జరిగాయని.. ఆ విషయాలను తర్వాత వెల్లడిస్తానని ఆమె తెలిపారు. పాలేరులో పోటీ అంశం త్వరలోనే వెల్లడిస్తానని వైఎస్‌ షర్మిల చెప్పారు.

YS Sharmila Tweet on KTR : 'ఎలక్షన్​కు ఆర్నెళ్ల ముందు నిద్రలేచే కుంభకర్ణుడు.. కేసీఆర్'

YSRTP Merger With Congress : తెలంగాణలో తాను 3,800కిమీ పాదయాత్ర చేశానని వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ పాల‌న పోతేనే తెలంగాణకు మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్​కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలంటే వండినట్లు.. తిన్నట్లు కాదని అన్నారు. రాజకీయాల్లో ముందుచూపు, ఓపిక, గుండె నిబ్బరం ఉండాలని చెప్పారు. తనతో నడిచిన వారిని తనతో పాటే నిలబెడతానని హామీ ఇచ్చారు.

YSRTP Merge in Congress : కాంగ్రెస్‌లో.. వైఎస్‌ఆర్‌టీపీ విలీనం కానుందా?

YS Sharmila Meets Sonia Gandhi : సోనియా, రాహుల్‌తో వైఎస్‌ షర్మిల భేటీ.. కాంగ్రెస్​లో YSRTP విలీనం ఖాయమేనా..?

Last Updated : Sep 2, 2023, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.