YS Sharmila fires on CM Kcr: పోలీసులపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన వైఎస్సాఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్‌పై విడుదల అయ్యారు. చంచల్‌గూడ జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. సీఎం కేసీఆర్, నిన్న తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్‌కు అవినీతి చేయడం తప్ప ఏమీ చేతకాలేదని షర్మిల ధ్వజమెత్తారు. మగ పోలీసులు తనను తాకే ప్రయత్నం చేయడంతో.. ఆత్మరక్షణ కోసం వారిని నెట్టివేయడం జరిగిందన్నారు. కేవలం ఇద్దరు మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారన్న ఆమె... మహిళా పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు.
'కేసీఆర్‌కు పరిపాలన చేతనవుతోందా? సీఎం కేసీఆర్ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్లారా? కేసీఆర్ ఏ హామీలు అమలు చేశారు? కేసీఆర్ ఎన్నో హామీలు గాలికివదిలేశారు. కేసీఆర్‌కు అవినీతి చేయడం తప్ప ఏమీ చేతకాలేదు. కేసీఆర్, ఆయన కుమార్తె, కుమారుడు అవినీతి చేస్తున్నారు. సిట్‌కు విజ్ఞప్తి పత్రం ఇవ్వాలనుకోవడం నేరమా? కేసీఆర్ పాలనను ఆప్ఘన్ పాలన అని కాక ఏమనాలి?.'- షర్మిల, వైఎస్సాఆర్టీపీ అధినేత్రి
మీ తాటాకు చప్పుళ్లకు భయపడం కేసీఆర్: మగ పోలీసులు తనను తాకే ప్రయత్నం చేశారని వైఎస్ షర్మిల అన్నారు. తనపై పడి దాడి చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తే ఏం చేయాలని మండిపడ్డారు. మహిళా పోలీసులు తన చేయి విరగ్గొట్టే ప్రయత్నం చేశారన్న షర్మిల.. కేసీఆర్ పాలనను ఆప్ఘన్ పాలన అని కాక ఏమనాలని ప్రశ్నించారు. ఆత్మరక్షణ కోసం మగ పోలీసులను నెట్టివేయడం జరిగిందన్నారు. తనను బెదిరించే వీడియోలు ఎందుకు బయటపెట్టలేదని షర్మిల ప్రశ్నించారు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్‌రెడ్డి బిడ్డ.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడదని హెచ్చరించారు.
'నా తల్లి విజయమ్మపై కూడా ఇష్టానుసారం ప్రవర్తించారు. రాజశేఖర్‌రెడ్డి భార్యను వేధించాడు సీఎం కేసీఆర్. రాజశేఖర్‌రెడ్డి కూతురును జైల్లో పెట్టాడు కేసీఆర్. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. ఇంతకు ఇంత అనుభవిస్తారు. పోలీసులకు నన్ను అరెస్ట్ చేసే అధికారం లేదు. రేపు ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేస్తున్నాం. తెలంగాణలో నిరుద్యోగుల తరఫున పోరాటం చేసింది మేమే. మా పోరాటం వల్లే.. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి. నేను వైఎస్‌ఆర్ బిడ్డను.. బోనులో పెట్టినా పులి పులే.'- షర్మిల, వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు
ఇవీ చదవండి: