ETV Bharat / bharat

పోలీస్​ జీపు చోరీ చేసి అత్తారింటికి.. దుస్సాహసంతో కటకటాల్లోకి.. - ఉత్తర్​ప్రదేశ్​ వార్తలు

అత్తారింటికి వెళ్లేందుకు బస్సు లేదా సొంత బైకు, కారును తీసుకెళ్తాం. అవి లేకపోతే క్యాబ్​ మాట్లాడుకుని వెళ్తాం. కానీ ఓ యువకుడు అత్తారింటికి వెళ్లేందుకు ఏకంగా పోలీస్​ జీపునే దొంగలించాడు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాలో జరిగింది.

youth stole police jeep
పోలీస్​ జీపు చోరీ చేసి అత్తారింటికి
author img

By

Published : Jun 13, 2022, 9:57 PM IST

Updated : Jun 13, 2022, 10:37 PM IST

పోలీస్​ జీపు చోరీ చేసి అత్తారింటికి

పోలీసుల వాహనం ఆగి ఉందంటే భయంతో దూరంగా వెళ్తాం. దాని దగ్గరకు వెళ్తే పోలీసులు ఏమంటారోననే భయం అందరిలో ఉంటుంది. కానీ, ఓ యువకుడు ఏకంగా పోలీస్​ జీపునే దొంగలించాడు. పట్టుకుని విచారించగా.. పోలీసులే ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చాడు. తాను అత్తారింటికి వెళ్లేందుకే జీపును చోరీ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ వింత సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాలో ఆదివారం జరిగింది.

ఇదీ జరిగింది: జిల్లా ఇంఛార్జ్​ మంత్రి బేరీరానీ మౌర్య.. సోనాపూర్​ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ విధులు నిర్వర్తించేందుకు కొత్వాల్​ నగర పోలీసు అధికారి సంజయ్​ కుమార్​ వెళ్లారు. కానీ, అక్కడ భారీగా జనం ఉండటం వల్ల జీపు పార్క్​ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. దీంతో కొంత దూరంలో రోడ్డు పక్కన పార్క్​ చేశాడు డ్రైవర్​. ఆ దగ్గర్లోనే సేదతీరాడు. ఈ క్రమంలోనే.. ముండెర్వా పోలీస్​ స్టేషన్​ పరిధి చపియాలుటావన్​ గ్రామానికి చెందిన హరేంద్ర(30) అనే వ్యక్తి మౌర్యకు వచ్చాడు. పోలీసు కారు రోడ్డు పక్కన ఖాళీగా ఉండటం, దానికే కీ ఉండటాన్ని గమనించాడు. మరోవైపు, పోలీసులు, జనం కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన హరేంద్ర.. పోలీస్​ జీపును తీసుకుని పరారయ్యాడు. జీవును ఎవరో తీసుకెళ్తున్నారని గమనించిన డ్రైవర్​ దీపేంద్ర అధికారులకు సమాచారం అందించాడు.

youth stole police jeep
చోరీకి గురైన పోలీసు జీపు

వెంటనే మరో వాహనంలో వెంబడించారు. తన వెంట పోలీసులు పడుతున్నారనే భయంతో మరింత వేగంగా వాహనాన్ని పోనిచ్చాడు హరేంద్ర. దాంతో జీపు అదుపుతప్పి పర్సా క్రాస్​రోడ్డు ప్రాంతంలో రహదారి పక్కన ఉన్న దుంగలకు ఢీకొట్టి. జీపు ముందు భాగం దెబ్బతిన్నది. అక్కడి నుంచి పారిపోయేందుకు హరేంద్ర ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. జీపు ఎందుకు దొంగలించావని అడగగా.. కొత్వాల్​ ప్రాంతంలోని కరియాపార్​ గ్రామంలో తన అత్తవారింటికి వెళ్తేందుకు తీసుకెళ్లానని చెప్పాడు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని, ఇంట్లో వాళ్లతో గొడవపడి వచ్చేసినట్లు పోలీసులు తెలిపారు. 'మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి పోలీసు కారును దొంగలించి తీసుకెళ్లాడు. నిందితుడిని అరెస్ట్​ చేసి దర్యాప్తు చేపట్టాం. కేసు నమోదు చేసి జైలుకు తరలించాం. డ్రైవర్​ దీపేంద్ర నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటాం' అని ఏఎస్​పీ దీపేంద్ర చౌదరి తెలిపారు.

youth stole police jeep
కర్రలను ఢీకొట్టి ధ్వంసమైన జీపు

ఇదీ చూడండి: 'ఏడు జన్మలు కాదు.. ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు దేవుడా'

ఐదేళ్ల బాలికపై 'డిజిటల్​ రేప్​'.. 15 ఏళ్ల బాలుడిపై కేసు

Last Updated : Jun 13, 2022, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.