ETV Bharat / bharat

ఛాలెంజ్ చేసి బాలికపై రేప్.. వీడియోను ఫ్రెండ్స్​కు పంపి.. వైద్యుడిని కొట్టి చంపిన ప్రేయసి! - bengaluru doctor death

ప్రేమను నిరూపించుకునేందుకు ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. బాలికపై అత్యాచారం చేసి వీడియో తీశాడు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. మరోవైపు, ప్రేమించిన వ్యక్తిపై స్నేహితులతో కలిసి దాడి చేసి హత్య చేసింది ఓ ప్రియురాలు.

youth-raped
youth-raped
author img

By

Published : Sep 19, 2022, 7:04 PM IST

ఝార్ఖండ్ ధన్​బాద్​లో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. స్నేహితులతో ఛాలెంజ్ చేసి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. ఈ వీడియో చివరకు బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరగా.. ఘటన వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కోయలంచల్ ధన్​బాద్​కు చెందిన యువకుల మధ్య ఓ మైనర్ విషయమై గొడవ జరిగింది. బాలిక తనను ప్రేమిస్తోందని స్నేహితుల్లో ఒకడు చెప్పగా.. తాను నన్నే లవ్ చేస్తోందని సంజయ్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ విషయమై ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. చివరకు.. తాను ఈ విషయాన్ని నిరూపిస్తానని సంజయ్.. తన స్నేహితులకు సవాల్ విసురుతాడు. ఆధారాలు కూడా అందిస్తానని వారితో చెబుతాడు.

స్నేహితులకు ఛాలెంజ్ చేసిన తర్వాతి రోజే.. మైనర్​కు మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకాన్ని ఫోన్​లో రికార్డు చేశాడు. బాలికతో ప్రేమలో ఉన్నాననేందుకు ఇదే రుజువు అని వీడియోను స్నేహితులకు పంపించాడు. అయితే, సంజయ్ స్నేహితులు ఆ వీడియోను బాలిక బంధువులకు చూపించారు. దీంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సంజయ్​ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

చెన్నై డాక్టర్.. బెంగళూరులో హత్య
మరోవైపు, తమిళనాడుకు చెందిన ఓ వైద్యుడు బెంగళూరులో హత్యకు గురయ్యాడు. అతడి ప్రేయసి తన స్నేహితులతో కలిసి వైద్యుడిని అంతమొందించింది. బేగుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ మికో లేఅవుట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతుడిని వికాస్​గా గుర్తించారు.

.
మృతుడు వికాస్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్.. ఉక్రెయిన్​లో వైద్య విద్య అభ్యసించాడు. చెన్నైలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఉన్నత విద్య కోచింగ్ కోసం వికాస్.. ఆరు నెలల క్రితం బెంగళూరుకు వచ్చాడు. ఆర్కిటెక్ట్​గా పనిచేస్తున్న ప్రతిభ.. సోషల్ మీడియా ద్వారా అతడికి పరిచయమైంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె.. వికాస్​తో ప్రేమలో పడింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. దీంతో నవంబర్​లో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

్
పోలీసుల అదుపులో నిందితులు

అంతలోనే అనూహ్య ఘటన చోటు చేస్కుంది. ప్రతిభతో పాటు ఆమె తల్లి రహస్య వీడియోలను వికాస్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఈ విషయమై ప్రతిభ, ఆమె కుటుంబం.. వికాస్​తో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి వికాస్‌కు బుద్ధి చెప్పాలని ప్రతిభ భావించింది. వికాస్​ను కర్ణాటకలోని మికో-లేఅవుట్‌కు రమ్మని పిలిచింది. వికాస్‌ ఒక్కడే అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న ప్రతిభ.. మరో నలుగురు స్నేహితులతో కలిసి వికాస్‌పై దాడి చేసి చేయగా అతడు కుప్పకూలాడు. స్పృహ లేకుండా పడి ఉన్న వికాస్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. ప్రతిభతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.