కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో నిరసన వ్యక్తం చేసిన ఆ పార్టీ నేతల పట్ల దిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్‌తో పోలీసులు దురుసుగా వ్యవహరించారు. నిరసన చేస్తున్న ఆయన్ను అదుపులోకి తీసుకునే క్రమంలో.. జుట్టు పట్టుకొని లాగారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ వర్గాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాయి. పోలీసులు శ్రీనివాస్‌ను చుట్టుముట్టి ఓ వాహనంలోకి నెడుతుండటం వీడియోలో కనిపిస్తోంది. ఆయన మాత్రం వాహనంలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
-
#WATCH | Delhi Police personnel seen pulling the hair of National President of Indian Youth Congress, Srinivas BV, and manhandling him earlier during the party's protest.
— ANI (@ANI) July 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Congress) pic.twitter.com/ODyN1YjERG
">#WATCH | Delhi Police personnel seen pulling the hair of National President of Indian Youth Congress, Srinivas BV, and manhandling him earlier during the party's protest.
— ANI (@ANI) July 26, 2022
(Source: Congress) pic.twitter.com/ODyN1YjERG#WATCH | Delhi Police personnel seen pulling the hair of National President of Indian Youth Congress, Srinivas BV, and manhandling him earlier during the party's protest.
— ANI (@ANI) July 26, 2022
(Source: Congress) pic.twitter.com/ODyN1YjERG
'చర్యలు తీసుకుంటాం'
కాగా, పోలీసులు ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై దిల్లీ పోలీసులు స్పందించారు. అనుచితంగా ప్రవర్తించిన సిబ్బందిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు, రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వరకు నిర్బంధంలో ఉంచి వారిని వదిలిపెట్టారు. రాత్రి 8గంటలకు రాహుల్ గాంధీ.. కింగ్స్‌వే పోలీసు క్యాంపు నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పోలీసుల నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. సాధారణ ప్రజల సమస్యలపై తాము పోరాడుతున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం, జీఎస్టీపై తాము మాట్లాడుతుంటే.. ప్రభుత్వం తమను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. అయితే, తాము ఇటువంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: