కరెంటు బిల్లు అధికంగా వచ్చిందని ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడు హైడ్రామా చేశాడు. ప్రమాదకర రీతిలో ఎలక్ట్రిక్ టవర్ పైకి ఎక్కి హల్చల్ సృష్టించాడు. కౌశాంబీ జిల్లాలోని పురా గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన అశోక్ కుమార్.. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. మూడేళ్ల కింద సౌభాగ్య పథకం ద్వారా అతనికి విద్యుత్ కనెక్షన్ వచ్చింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాడు. అయితే తాజాగా అతడికి రూ.8,700 కరెంటు బిల్లు వచ్చింది. దీంతో అశోక్‌కు గుండె ఆగినంత పనైంది.
బిల్లును చూసిన తర్వాత తన భర్త మానసిక పరిస్థితి దిగజారిపోయిందని అశోక్ భార్య మోహని దేవి తెలిపారు. ఈ క్రమంలోనే హై వోల్టేజ్ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు అశోక్. ఆ సమయంలో అతడి భార్య పొలం పనుల కోసం వెళ్లారు. టవర్ ఎక్కడమే కాకుండా.. విద్యుత్ తీగలపై పాకుతూ ముందుకు వెళ్లాడు అశోక్. అయితే ఆ సమయంతో కరెంటు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని కిందకు దించారు.
ఇదీ చదవండి: