ఈ వారం (అక్టోబర్ 3- 9) రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు మీకోసం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
మంచి విజయాలు సాధిస్తారు. అధైర్య పడవద్దు. ఉద్యోగరీత్యా శుభ ఫలితం ఉంటుంది. వ్యాపారబలం పెరుగుతుంది. గృహయోగం ఉంది. ఒక పనిలో ఆటంకం తొలగుతుంది. ముఖ్య వ్యక్తులతో అభిప్రాయాలను పంచుకోండి. వారి సూచనలు మేలుచేస్తాయి. వారం చివర ఆనందించే అంశముంది. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ముఖ్యకార్యాల్లో విజయం ఉంటుంది. ప్రతి పనీ శ్రద్ధతో ప్రారంభించండి. కాలం కొంతవరకే సహకరిస్తోంది. తొందరపాటు నిర్ణయం పనికిరాదు. శాంతంగా ఆలోచించండి. ఉద్యోగంలో శుభఫలితం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మిత్రుల అండ అవసరం. వ్యయం పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే ఉత్తమం.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
మనోబలంతో విజయం లభిస్తుంది. దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. ద్వంద్వ వైఖరి మంచిది కాదు. వ్యాపారలాభం ఉంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. నిరంతరమైన సాధనతో లక్ష్యాన్ని చేరుకోవాలి. పెద్దల వల్ల మేలు చేకూరుతుంది. ధన యోగం సూచితం. ఆధ్యాత్మికంగా సమయం గడపటం మంచిది. శివధ్యానం శుభాన్నిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
ఉత్తమ కాలం నడుస్తోంది. త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. అదృష్టయోగం ఉంది. సకాలంలో పనులు ప్రారంభించాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార నైపుణ్యాలు పెరుగుతాయి. ఆశించిన ఫలితం వస్తుంది. సాహసంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు తోడ్పడతాయి. మీవల్ల కొందరికి మంచి జరుగుతుంది. గణపతిని ఆరాధించండి, స్థిరత్వం లభిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ధర్మబద్ధంగా ముందుకు సాగండి. శుభ ఫలితం సాధిస్తారు. వ్యాపారబలం పెరుగు తుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. పై అధికారుల ప్రశంసలు అందుతాయి. అపోహలు తొలగుతాయి. శత్రుదోషం పోతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. గృహ, వాహనాది సౌఖ్యముంటుంది. శుభవార్త వింటారు. ఇష్టదైవస్మరణ మంచిది.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)
ఉద్యోగ విజయం ఉంది. వ్యాపారబలం పెరుగుతుంది. తోటివారి సహకారం అవసరం. సొంత నిర్ణయం కొంత శ్రమ కలిగిస్తుంది. ఇంట్లో వారితో సంప్రదించి చేసే పనులు అదృష్టాన్ని ఇస్తాయి. గొప్ప ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి. ఎదురుచూస్తున్న పని ముందుకు సాగుతుంది. సూర్యస్తుతి మనోబలాన్నిస్తుంది.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. మనోబలంతో లక్ష్యాన్ని సాధించండి. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. అంతా శుభమే జరుగుతుందన్న నమ్మకంతో పని చేయండి. వ్యాపారంలో లాభముంటుంది. ధర్మమార్గంలో పయనించండి. ఎవరితోనూ విభేదించవద్దు. ఆంతరంగిక విషయాలు చర్చించవద్దు. కుటుంబ సహకారం తప్పనిసరి. ఆదిత్యహృదయం చదివితే మేలు.
వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
సర్వోత్తమ కాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. కోరుకున్న జీవితం లభిస్తుంది. తోటివారికి మీవల్ల సహాయం అందుతుంది. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. మంచి భవిష్యత్తుకు పునాదులు వేయండి. ఆటంకాలు తొలగి ఆనందంగా గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించండి. ఇష్టదేవతాస్మరణ మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఉద్యోగంలో పెద్దల ప్రశంసలు పొందుతారు. ఆగిన పనులు తిరిగి మొదలవుతాయి. గృహప్రాప్తి సూచితం. ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండండి. అపార్థాలకు అవకాశం లేకుండా దగ్గరివారితో ప్రేమగా వ్యవహరించాలి. శనిశ్లోకం మనశ్శాంతినిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)
ఖర్చు పెరగనివ్వవద్దు. ముఖ్య కార్యాల్లో తెలియని ఆటంకాలు ఉంటాయి. చాక చక్యంగా వ్యవహరించాలి. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. ఆలోచించి మాట్లాడాలి. కష్టకాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఓర్పు అవసరం. కుటుంబ సభ్యుల సలహాతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యస్తుతి శక్తినిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
పట్టుదలతో లక్ష్యం సిద్ధిస్తుంది. అడుగడుగునా విఘ్నాలుంటాయి. దేనికీ వెనకడుగు వేయవద్దు. సత్యమార్గంలో నడవండి. కోరుకున్న ఫలం దక్కుతుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. ఉద్యోగంలో సమస్య ఎదురుకాకుండా చూసుకోవాలి. మిత్రుల సహకారం చాలా అవసరం. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. నవగ్రహశ్లోకాలు చదవండి, మంచి జరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉత్తమ కాలం నడుస్తోంది. అదృష్ట వంతులవుతారు. ఆపదల నుంచి బయట పడతారు. ఉద్యోగంలో శుభఫలితం ఉంటుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. వివాదాలకు తావివ్వకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి. చక్కని వ్యాపార యోగముంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శుభవార్తలు వింటారు.