ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (అక్టోబర్​ 10- 16)

author img

By

Published : Oct 10, 2021, 4:13 AM IST

ఈ వారం (అక్టోబర్​ 10- 16) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

Weekly Horoscope
ఈ వారం రాశిఫలం

ఈ వారం (అక్టోబర్​ 10- 16) రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు మీకోసం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఉద్యోగ వ్యాపారాలు కలిసివస్తాయి. విఘ్నాలు తొలగుతాయి. ఎదురుచూస్తున్న పనుల్లో త్వరగా పురోగతి ఉంటుంది. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. అంచెలంచెలుగా పైకి వస్తారు. పోయినవి తిరిగి లభిస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. బంధాలు బలపడతాయి. తగినంత విశ్రాంతి అవసరం. శివస్మరణతో శాంతి లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగం బాగుంటుంది. ఆశయం నెరవేరుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. తడబడకుండా నిర్ణయం తీసుకోండి. మానసిక దృఢత్వం అవసరం. తోటివారితో కలిసి పనిచేయండి. వారం మధ్యలో మంచి జరుగుతుంది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

పనుల్లో వేగం పెంచాలి. అవరోధాలను సమర్థంగా ఎదుర్కోవాలి. ఉద్యోగంలో జాగ్రత్త. వాగ్వాదాలకు అవకాశమివ్వవద్దు. ఆపదలు పొంచి ఉన్నాయి. కావాలని ఇరికించే ప్రయత్నాలు జరుగుతాయి. సమష్టి కృషితో విజయం లభిస్తుంది. గత వైభవం సిద్ధిస్తుంది. మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. ఇష్టదేవతాస్మరణ శుభ యోగాన్నిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)

అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆలోచనలు కార్యసిద్ధినిస్తాయి. వ్యాపారరీత్యా ఉన్నతస్థితి గోచరిస్తోంది. బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరండి. ఎదురుచూస్తున్న ఫలితం ఒకటి వెంటనే వస్తుంది. క్రమంగా సుస్థిరత సాధిస్తారు. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణుసహస్రనామం చదవండి, మంచి భవిష్యత్తు ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

చక్కని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే తిరుగులేని భవిష్యత్తు ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. అపార్థాలకు అవకాశమివ్వకండి. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఒక విషయంలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. సూర్యస్తుతి మేలుచేస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)

అదృష్టయోగముంది. సకాలంలో ప్రయత్నించాలి. ఉద్యోగంలో శ్రద్ధ వహించండి. సామరస్య ధోరణి చాలా అవసరం. పనులకు ఆటంకాలు కలిగించేవారున్నారు. చాకచక్యంగా వ్యవహరించాలి. ఆర్థికంగా కలిసివస్తుంది. ఆపదలు తొలగుతాయి. శత్రుదోషం కొంత ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో శాంతి లభిస్తుంది. సూర్యనమస్కారం మంచిది.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు. చిన్న విషయమే పెద్దది అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో పని చేయాలి. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆర్థికంగా కొంత బాగుంటుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అధికారులతో సమస్య రాకుండా చూసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు.

వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)

అద్భుతమైన శుభకాలమిది. మంచి పనులకు శ్రీకారం చుడతారు. ఇప్పుడు చేసే పనులు స్థిరమైన ఫలితాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంది. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడవద్దు. ఉన్నతస్థితి గోచ రిస్తోంది. గృహ-భూ-వాహనాది యోగాలున్నాయి. వస్తు వస్త్రప్రాప్తి సూచితం. ఇష్టదైవాన్ని స్మరించండి, ఆశయం నెరవేరుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. అధికారుల సలహాను పాటించండి. ఆర్థికస్థితి మెరుగవుతుంది. సమయానుకూల నిర్ణయాలు లాభాన్నిస్తాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. వాదాలకు అవకాశమివ్వకుండా శాంతంగా సమస్యల్ని పరిష్కరించండి. కుటుంబపరమైన అభివృద్ధి సూచితం. ఆనందించే అంశముంది. అభినందనలు అందుకుంటారు. ఇష్టదైవస్మరణ మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)

అదృష్టయోగముంది. సకాలంలో పని పూర్తి చేసి సత్ఫలితాన్ని పొందండి. ఉద్యోగంలో బాగుంటుంది. శ్రమపెరిగినా గుర్తింపు విశేషంగా ఉంటుంది. వ్యాపారరీత్యా కలిసివస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సజ్జన సాంగత్యంతో లబ్ధి పొందుతారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆశయం నెరవేరుతుంది. శివారాధన శ్రేష్ఠమైన ఫలితాన్నిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ముఖ్యకార్యాలను శ్రద్ధతో పూర్తి చేయాలి. కాలం అనుకూలంగా లేదు. అధిక నష్టం రాకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహా పనిచేస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వారం మధ్యలో ఒక పని పూర్తి అవుతుంది. ఉత్సాహం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో ఇబ్బందులున్నాయి. ఏకాగ్రతతో పనిచేస్తే లక్ష్యం సిద్ధిస్తుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

శ్రేష్ఠమైన విజయం లభిస్తుంది. ప్రయత్నలోపం లేకుండా కృషిచేయాలి. ఉద్యోగ ఫలితం బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆర్థికంగా లాభపడతారు. ధర్మం రక్షిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయండి. ఆటంకాలు తొలగుతాయి. ప్రయాణంలో మంచి జరుగుతుంది. ఆదిత్యహృదయం చదవాలి, వెతుకుతున్నది దొరుకుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.