ETV Bharat / bharat

కరోనా టెస్టు చేయించుకోలేదని యువకులపై దాడి - యువకులపై దాడి

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాం అనే సామెత సరిగ్గా సరిపోతుంది ఈ ఇద్దరు యువకులకు. బెంగళూరులో టీకా కోసం వెళ్లిన వీరు చాలా సేపు లైన్​లో ఉన్నారు. చివరకు అది కరోనా పరీక్ష కేంద్రం అని తెలిసి నిరాశతో వెనుతిరగాలనుకున్నారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది వారిని టెస్టు చేయించుకోవాలని కోరారు. అందుకు నిరాకరించడం వల్ల వారిపై దాడికి దిగారు.

COVID test at BBMP
కరోనా టెస్టు చేయించుకోలేదని కొట్టిన సిబ్బంది
author img

By

Published : May 25, 2021, 6:39 AM IST

ఇద్దరు యువకులపై బృహత్​ బెంగళూరు మహానగర పాలక సంస్థ(బీబీఎంపీ) సిబ్బంది దాడి చేశారు. కరోనా టెస్టు చేయించుకునేందుకు వారు నిరాకరించడమే ఇందుకు కారణం. టీకా కోసం వచ్చిన ఇద్దరు యువకులు చాలా సేపు లైన్​లో పాడిగాపులు కాశారు. తీరా అది టీకా కేంద్రం కాదు, కొవిడ్​ పరీక్షా కేంద్రం అని తెలిసే సరికి మెల్లగా అక్కడి నుంచి జారుకునేందుకు యత్నించారు.

అంత సేపు క్యూలో నిలబడి వెనక్కి వెళ్తున్న వీరిని గమనించిన బీబీఎంపీ సిబ్బంది మర్యాదగా కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వారు ససేమిరా అనడం వల్ల బలవంతంగా పరీక్ష కేంద్రం వద్దకు లాక్కెళ్లారు. టెస్ట్​ చేయించుకునేందుకు యువకులు నిరాకరించడం వల్ల వారిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. యువకులపై చేయి చేసుకున్న అధికారులపై కేసు నమోదైంది.

"ఈ ఘటన నాగరత్‌పేట్ టెస్టింగ్​ కేంద్రంలో జరిగింది. దీనిని మేము ఖండిస్తున్నాము. నిజానికి ఇది బాధాకరమైన విషయం. బలవంతంగా ఎవరికీ పరీక్షలు చేయించేది లేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి విచారణకు ఆదేశిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటున్నాం."

- గౌరవ్​ గుప్తా, బీబీఎంపీ కమిషనర్

ఇదీ చూడండి: షాప్​ తెరిచి ఉంచాడని.. చెంప చెళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.