కర్ణాటకకు చెందిన ఓ యువతి పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించి.. ఓ యువకుడిని మోసం చేసింది. అతడి నగ్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి యువకుడి నుంచి రూ. లక్ష వసూలు చేసింది. తాను మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఏం జరిగింది?
కర్ణాటక హులిమావులో ఉండే యువకుడు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం జీవన్ సాతి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో అకౌంట్ ప్రారంభించాడు. ఆ మ్యాట్రిమోనియల్ సైట్లో వధువు కోసం వెతుకుతున్న యువకుడికి... ఓ యువతి పరిచయమైంది. ఇరువురు కొన్ని రోజులు బాగా మాట్లాడుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
అయితే పెళ్లికి ముందు.. యువకుడి మర్మ భాగాలను చూడాలని ఆ అమ్మాయి కోరింది. దీంతో యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఫొటోలను పంపిస్తేనే పెళ్లి చేసుకుంటానని యువతి చెప్పడం వల్ల ఆ యువకుడు.. అతని నగ్న వీడియోను ఆమెకు పంపాడు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి రూ. లక్ష వసూలు చేసింది ఆమె. ఇంకా డబ్బు కావాలని ఆ యువతి వేధించింది. దీంతో హులిమావు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు యువకుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి : 'ఫోన్ నంబర్ ఇవ్వలేదని హత్య చేశాను'