కరోనా.. ఎంతో మందిని బలితీసుకుని ఆ కుటుంబాలకు శోకాన్ని మిగిల్చడమే కాదు, కడచూపు కూడా లేకుండా చేస్తోంది. అయితే తన విషయంలో అలా జరగకూడదని కర్ణాటక కలబురిగి జిల్లాకు చెందిన ఓ యువకుడు.. కొవిడ్‌తో చనిపోయిన తన తల్లిని చూసేందుకు ఆస్పత్రి భవనం ఎక్కాడు.
తన తల్లిని చివరి చూపు చూసేందుకు అధికారులు అంగీకరించకపోవడం వల్ల ఈ సాహసం చేశాడు. అయితే కొంత సమయం తర్వాత ఆ యువకుడి డిమాండ్ మేరకు మృతురాలిని చూసేందుకు అధికారులు అనుమతించారు.
12 రోజుల క్రితం కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు.. ఆదివారం మరణించింది.
ఇదీ చూడండి: ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి- బంధువుల ఆందోళన