షూ లేస్ మెడకు బిగుసుకుని ఊపిరాడక ఓ పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని మల్లప్పురం జిల్లాలో జరిగిందీ ఘటన.
మల్లప్పురం జిల్లా పూకోట్టుంపాదం గ్రామంలో నివసిస్తున్న ఫైజల్ నజీర్-ఓపీ మునీరా కుమారుడైన మహమ్మద్ రఫిక్ (10) గురువారం ఆడుకుంటున్న సమయంలో.. అనుకోకుండా మెడకు షూ లేస్ బిగుసుకుంది. దీనితో రఫిక్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తల్లిదండ్రులు ఆ బాలుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీనితో రఫిక్ కుటుంబ సభ్యుల్లో విషాదం అలముకుంది.
ఇదీ చదవండి: Supreme Court: అనాథ బాలలకు త్వరగా 'పీఎం కేర్స్'