ETV Bharat / bharat

గర్ల్​ఫ్రెండ్​తో చాటింగ్, ఆరు గంటలు ఆగిపోయిన విమానం - ఫ్రెండ్లీ చాటింగ్‌

ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య సరదాగా జరిగిన చాటింగ్ ఏకంగా ఆరు గంటలపాటు ఓ విమానాన్ని నిలిపివేసింది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో జరిగింది. అసలేం జరిగిందంటే

mangaluru airport
మంగళూరు విమానాశ్రయం
author img

By

Published : Aug 15, 2022, 8:01 PM IST

ఓ అబ్బాయి.. అమ్మాయి మధ్య సరదాగా జరిగిన ఓ మొబైల్‌ చాటింగ్ సంభాషణ.. 185 మందిని భయభ్రాంతులకు గురిచేసింది. టేకాఫ్ అవ్వాల్సిన విమానాన్ని ఏకంగా ఆరు గంటల పాటు నిలిపేసింది. అదేంటీ.. విమానం ఆలస్యమవ్వడానికి ఆ చాటింగ్‌కు సంబంధం ఏంటనుకుంటున్నారా? అయితే ఇది చదవండి..!

ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నిన్న మంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అబ్బాయి ముంబయి వెళ్లేందుకు.. అమ్మాయి బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ముంబయి వెళ్లే విమానం రాగానే అబ్బాయి వెళ్లి విమానంలో కూర్చున్నాడు. అమ్మాయేమో తన విమానం కోసం ఎదురుచూస్తోంది. బోర్‌ కొడుతుంది అనుకున్నారేమో ఇద్దరూ మొబైల్‌లో చాట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా విమానాల్లో భద్రత గురించి సరదాగా మాట్లాకుంటూ 'నువ్వే ఓ బాంబర్‌' అంటూ ఆ అమ్మాయి.. అబ్బాయికి మెసేజ్‌ చేసింది.

mangaluru airport
చాటింగ్ చేసుకున్న అబ్బాయి, అమ్మాయి

ఆ మెసేజ్‌ సరిగ్గా విమానంలో అబ్బాయి వెనుక సీట్లో కూర్చున్న తోటి ప్రయాణికురాలి కంట్లో పడింది. దీంతో భయాందోళనకు గురైన ఆ ప్రయాణికురాలు వెంటనే విమాన సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో టేకాఫ్ అవ్వాల్సిన విమానం ఆగిపోయింది. విమానాశ్రయ సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ దించేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించలేదు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఆ తర్వాత సదరు చాటింగ్‌ చేసిన అమ్మాయి, అబ్బాయిని పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. అది కేవలం సరదా సంభాషణే తేలడంతో విమానం టేకాఫ్‌ అయ్యేందుకు అనుమతినిచ్చారు. అలా దాదాపు ఆరుగంటల తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆ విమానం ముంబయి బయల్దేరింది. విచారణ అనంతరం అబ్బాయిని విమానం ఎక్కేందుకు అనుమతినిచ్చారు. అయితే ఆ అమ్మాయి మాత్రం విమానం మిస్సవాల్సి వచ్చింది. అయితే అది ఫ్రెండ్లీ చాటింగ్‌ అని తేలడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదని, దీంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఏదేమైనా.. ఒక్క ఫన్‌ చాటింగ్‌ ఎంత పని చేసిందో కదా..!

ఇవీ చదవండి: దళిత విద్యార్థిని బాత్​రూమ్​లో పెట్టి తాళం వేసిన టీచర్​, 18 గంటలు అలానే

అవినీతి, కుటుంబ పాలనను ఏరిపారేయాలి, సవాళ్లున్నా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.