ETV Bharat / bharat

యశ్వంత్ సిన్హా చేరిక తృణమూల్​కు లాభమా? - bengal elections

ఒకప్పుడు కేంద్రంలో రెండు కీలక శాఖలకు మంత్రిగా, భాజపా అగ్రనేతల్లో ఒకరిగా గుర్తింపు. ఆ తర్వాత ఆ పార్టీకి దూరం. ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ విమర్శలు, ఆపై క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి. మరిప్పుడు హఠాత్తుగా తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిక. ఇదీ కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా గురించి చెప్పాల్సి వస్తే వివరించే మాటలు. ఒకప్పుడు భాజపాలో చక్రం తిప్పిన ఈయన చేరిక తృణమూల్‌కు శాసనసభ ఎన్నికల్లో ఏమేరకు లాభం చేయనుంది?

Yaswanth
యశ్వంత్ సిన్హా చేరిక తృణమూల్​కు లాభమా?
author img

By

Published : Mar 14, 2021, 9:00 AM IST

కొన్నాళ్లు రాజకీయ తెరమీద నుంచి అదృశ్యమైన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా శనివారం.. తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. గతంలో ఆర్థిక, విదేశాంగ మంత్రిగా పని చేసిన యశ్వంత్..‌ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో తరచూ వార్తల్లో నిలిచేవారు. ఒకప్పుడు భాజపాలో కీలక నేతగా వ్యవహరించిన ఆయన, మోదీ ప్రధాని అయిన తర్వాత ఆ పార్టీని వీడారు. మోదీ తొలి విడత మంత్రివర్గంలో తన కుమారుడు జయంత్‌ సిన్హా మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనూ ప్రధానిపై విమర్శలను ఆపే వారు కాదు యశ్వంత్‌.

గత కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న యశ్వంత్‌ సిన్హా హఠాత్తుగా తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, యశ్వంత్‌ సిన్హా.. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మంత్రివర్గంలో కలిసి పనిచేశారు. టీఎంసీలో చేరడం ఆలస్యం.. మమతపై బోలెడు ప్రశంసలు కురిపించారు యశ్వంత్‌. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు కూడా చేశారు. మమత ఆది నుంచీ పోరాడుతూనే ఉన్నారని ఆయన అన్నారు.

తృణమూల్​కు భారీ మెజార్టీ

1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి అఫ్గానిస్థాన్​‌లోని కాందహార్‌కు తీసుకువెళ్లిన సమయంలో జరిగిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సమయంలో హైజాక్‌ సంఘటనపై కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరిగిందని, ఉగ్రవాదుల చెరలో ఉన్న వారిని విడుదల చేయాలనే షరతుతో తాను బందీగా వెళతానని మమత అప్పుడు చెప్పారని యశ్వంత్ సిన్హా వెల్లడించారు. బంగాల్ ఎన్నికల్లో తృణమూల్‌ భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. మోదీ, అమిత్ షాలు దేశాన్ని నడుపుతున్న తీరును దేశం సహించబోదనే సందేశం బంగాల్ ఎన్నికలు ఇస్తాయని వ్యాఖ్యానించారు.

మమత గెలుపే మోదీ ఓటమికి పునాది అని వ్యాఖ్యానించారు. బంగాల్​ ఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​ విజయం సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సిన్హా.

భాజపా నేతలు, మమతా బెనర్జీ మధ్య విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు సాగుతున్న వేళ తృణమూల్‌లో యశ్వంత్‌ చేరిక, భాజపాపై ఆయన విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కుమారుడు భాజపాలోనే ఉన్న తరుణంలో యశ్వంత్‌ ఆ పార్టీపై చేసే విమర్శలు కమలం పార్టీకి ఒకింత ఇబ్బందికర పరిణామమే. ఒకప్పుడు భాజపాలో కీలక నేతగా, మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా యశ్వంత్‌ చేసే విమర్శల వల్ల తృణమూల్‌కు ఎంతో కొంత లాభం చేకూర్చగలవని రాజకీయ పండితుల అంచనా.

ఇదీ చదవండి : 'భాజపాకు ఓటేయకండి'- నందిగ్రామ్​లో టికాయత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.