యాస్ తుపాను మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, బంగాల్ తీర ప్రాంతాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళఖాతంలో వాయవ్య దిశాగా కదులుతోందని ఐఎండీ డైరెక్టర్ మోహపాత్ర తెలిపారు. ఉత్తర- వాయవ్య దిశగా పయణిస్తూ మరింత తీవ్రంగా మారి బుధవారం ఉదయానికి ఒడిశా ఉత్తర భాగంలోని దమ్రా నౌకాశ్రయాన్ని తాకే అవకాశాలున్నాయని వెల్లడించారు.
ఒడిశాలోని ఉత్తర భాగం నుంచి బంగాల్ పశ్చిమ భాగంలో గల తీరప్రాంతంలో, పారాదీప్-సాగర్ ఐస్లాండ్ మధ్య, దమ్రాకు ఉత్తర భాగంలో, బాలాసోర్‌కు దక్షిణ ప్రాంతానికి బుధవారం మధ్యాహ్నానికి తుపాను చేరుకుంటుందని ఐఎమ్‌డీ తెలిపింది.
బంగాల్లో యాస్ నష్టం..

తుపాను యాస్ ప్రభావంతో హలీశహర్లో 40 ఇళ్లు నేలమట్టం అయ్యాయని బంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ఇప్పటికే 11.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్పష్టం చేశారు. పాండువా ప్రాంతంలో పిడుగల ధాటికి ఇద్దరు మరణించారని తెలిపారు.

ఇదీ చదవండి: తమిళనాడులో ఆందోళనకర స్థాయిలో కరోనా