ETV Bharat / bharat

'ఆ కేసులో ఆధారాల్లేవ్'.. బ్రిజ్ భూషణ్​పై పోక్సో కేసు రద్దు! దిల్లీ పోలీసుల ఛార్జ్​షీట్ - wrestling federation of india case

Wrestlers protest update : రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్​పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో దిల్లీ పోలీసులు ఛార్జ్​షీట్ దాఖలు చేశారు. అయితే, ఆయనపై పోక్సో కేసును ఎత్తివేసేందుకు అనుమతించాలని కోర్టును కోరారు.

wrestlers protest news
wrestlers protest chargesheet
author img

By

Published : Jun 15, 2023, 1:03 PM IST

Updated : Jun 15, 2023, 1:31 PM IST

Wrestlers protest update : లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్​పై నమోదైన పోక్సో కేసును ఎత్తివేసేందుకు అనుమతించేలా దిల్లీ పోలీసులు న్యాయస్థానాన్ని కోరుతూ నివేదిక సమర్పించారు. రెజ్లర్లను వేధించారన్న కేసులో 500 పేజీల ఛార్జ్​షీట్ దాఖలు చేసిన పోలీసులు.. మైనర్ ఆరోపణలపై నమోదైన కేసును రద్దు చేయాల్సిందిగా కోరారు. మైనర్ రెజ్లర్ ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు ఛార్జ్​షీట్​లో పేర్కొన్నారు. బాలిక, ఆమె తండ్రి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోక్సో కేసు రద్దుకు సంబంధించి నివేదిక సమర్పిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. మరోవైపు, మిగతా రెజ్లర్ల ఆరోపణలపై ఛార్జ్​షీట్ నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపులు, నిఘా వేయడం (స్టాకింగ్) వంటి నేరాల గురించి ఛార్జ్​షీట్​లో ప్రస్తావించినట్లు వెల్లడించారు. కోర్టులో దీనిపై తదుపరి విచారణ జులై 4న జరగనుంది.

"పోక్సో కేసు విషయానికి వస్తే.. మా విచారణ పూర్తైన తర్వాత సీఆర్​పీసీ సెక్షన్ 173 ప్రకారం కేసును రద్దు చేయాలని కోరుతూ నివేదిక సమర్పించాం. ఫిర్యాదుదారు (మైనర్ తండ్రి)తో పాటు బాధితురాలి స్టేట్​మెంట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇతర రెజ్లర్ల ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 354డీ ప్రకారం ఛార్జ్​షీట్ దాఖలు చేశాం. సస్పెన్షన్​కు గురైన రెజ్లింగ్ ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రెటరీ వినోద్ తోమర్​పై ఐపీసీ సెక్షన్లు 109, 354, 354ఏ, 506 ప్రకారం ఛార్జ్​షీట్ నమోదు చేశాం."
-దిల్లీ పోలీసులు

బ్రిజ్ భూషణ్​ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న రెజ్లర్లు.. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్​తో వేర్వేరుగా సమావేశమై తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ సందర్భంగా వెంటనే ఛార్జ్​షీట్ దాఖలు చేయకపోతే తమ ఆందోళనలను మళ్లీ ప్రారంభిస్తామని, ఉద్ధృతంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. జూన్ 15 నాటికి ఈ కేసులో ఛార్జ్​షీట్ దాఖలవుతుందని ఆ సమావేశంలోనే మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు.

రెజ్లర్ల ఆరోపణలు ఏంటంటే?
బ్రిజ్ భూషణ్ తమతో అనుచితంగా ప్రవర్తించేవారని పోలీసులకు రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. దగ్గరకు పిలిచి ఒంటిపై దుస్తులు లాగేవాడని ఆరోపించారు. శ్వాసక్రియను పరిశీలిస్తానని చెప్పి ఛాతిని తాకేవాడని ఓ రెజ్లర్ వాపోయారు. కోచ్ లేని సమయంలో తమను వేధింపులకు గురిచేసేవారని మరో రెజ్లర్ పోలీసులకు తెలిపారు. అంతర్జాతీయ పోటీలో గాయపడ్డప్పుడు.. తనతో సన్నిహితంగా ఉంటే వైద్య ఖర్చులు ఫెడరేషన్ భరించేలా చూస్తానని బ్రిజ్ భూషణ్ చెప్పినట్లు మరో రెజ్లర్ ఆరోపించారు. అయితే, రెజ్లర్ల ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఆ ఆరోపణలు నిజమైతే తాను ఉరేసుకుంటానని ప్రకటించారు.

Last Updated : Jun 15, 2023, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.