ETV Bharat / bharat

ప్రపంచంలోనే అతిపొడవైన గ్యాస్ పైప్​లైన్ పనులు షురూ - వారణాసి

ప్రపంచంలోనే అతి పొడవైన గ్యాస్ పైపులైన్ పనులు ఉత్తర్ ప్రదేశ్​లో మొదలయ్యాయి. ఈ మేరకు వారణాసిలో భూమి పూజ నిర్వహించారు. రూ.10వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2024లోపు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.

Work on the world's longest LPG pipeline project starts in Varanasi
ప్రపంచంలోనే అతిపొడవైన గ్యాస్ పైపులైన్ పనులు ప్రారంభం
author img

By

Published : May 18, 2021, 3:57 PM IST

ప్రపంచంలోనే అతి పొడవైన గ్యాస్ పైపులైన్ పనులు ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని రామాయి పట్టి గ్రామంలో సోమవారం ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కింద గుజరాత్​లోని కాండ్ల పోర్టు నుంచి గోరఖ్​పుర్ వరకు 2,805 కిలోమీటర్ల మేర ఈ పైపులైన్ వేస్తున్నారు. 2024లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Work on the world's longest LPG pipeline project starts in Varanasi
భూమి పూజ కార్యక్రమం

రూ.10 వేల కోట్ల వ్యయం..

ఈ పథకం ద్వారా యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ లబ్ధి పొందనున్నాయి. ఈ ప్రాజెక్టులో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంయుక్తంగా రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటిలో ఇండియన్ ఆయిల్ 50 శాతం, మిగిలినవి 25 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి.

పైపులైన్ పనులు ప్రారంభించిన సిబ్బంది

34 కోట్ల మందికి లబ్ధి..

3 రాష్ట్రాల్లోని మొత్తం 22 గ్యాస్ రీఫిల్లింగ్ ప్లాంట్లకు ఈ పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా కానుంది. వీటిలో గుజరాత్​లో 3, మధ్యప్రదేశ్​లో 6, యూపీలో 13 రీఫిల్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. మొత్తం 34కోట్ల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇంత పొడవైన గ్యాస్ పైపులైన్ ఏ దేశంలోనూ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టుతో భారత్.. ప్రపంచ రికార్డును నెలకొల్పనుంది.

ఇదీ చూడండి: యూపీలో టెస్టింగ్ కార్యక్రమం.. ఆర్భాటాలకే పరిమితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.