ETV Bharat / bharat

Womens Reservation Bill 2023 : మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నికల 'జుమ్లా'.. ఆ నిబంధనలు చేర్చడం తప్పు: విపక్షాలు - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

Womens Reservation Bill 2023 Opposition Reaction : ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే ఈ బిల్లు ఎన్నికల జుమ్లా అని కాంగ్రెస్​ అభివర్ణించింది. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ నిబంధనలను బిల్లులో పొందుపరచడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుబట్టింది.

Womens Reservation Bill 2023 Opposition Reaction

author img

By PTI

Published : Sep 19, 2023, 5:35 PM IST

Updated : Sep 19, 2023, 7:48 PM IST

Womens Reservation Bill 2023 Opposition Reaction : కేంద్రం మంగళవారం లోక్​సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ బిల్లును 'ఎన్నికల జుమ్లా' అని కాంగ్రెస్ అభివర్ణించింది. మహిళల ఆశలకు 'భారీ ద్రోహం' అని విమర్శించింది. ఈ చట్టం జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాతే అమలులోకి వస్తుందని బిల్లులో పేర్కొనడంపై మండిపడింది. 2024 ఎన్నికల లోపు డీలిమిటేషన్ జరుగుతుందా? అని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం 2021 జనగణను ఇంకా నిర్వహించలేదన్నారు. ఇక ఎన్నికల సీజన్​లో జుమ్లాల కంటే ఇది పెద్దది అని ఎద్దేవా చేశారు. ఇక జీ20 దేశాల్లో జన గణన చేయడంలో విఫలమైన దేశం భారత్​ మాత్రమే అని అన్నారు. ఇది ఈవెంట్​ మేనేజ్​మెంట్​ తప్ప మరొకటి కాదని ఘాటుగా విమర్శించారు.

  • चुनावी जुमलों के इस मौसम में, यह सबसे बड़ा जुमला है! यह देश की करोड़ों महिलाओं और लड़कियों की उम्मीदों के साथ बहुत बड़ा विश्वासघात है।

    हमने पहले भी बताया है कि मोदी सरकार ने अभी तक 2021 में होने वाली दशकीय जनगणना नहीं की है। भारत G20 का एकमात्र देश है जो जनगणना कराने में विफल… https://t.co/8iuBVXM49S

    — Jairam Ramesh (@Jairam_Ramesh) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇది మహిళలను మోసం చేసే బిల్లు: ఆప్​
మహిళా రిజర్వేషన్​ బిల్లును ఎన్నికల ముందు మహిళలను మోసం చేసే బిల్లు అని ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత అతిషి విమర్శించారు. బీజేపీకి మహిళల సంక్షేమం పట్ల ఆసక్తి లేదని ఆరోపించారు. ఈ బిల్లును నిశితంగా చిదివితే అది 'మహిళలను ఫూల్​ చేసే బిల్లు' అని తెలుస్తుందని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో డీలిమిటేషన్, జనాభా లెక్కల నిబంధనలను ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. 'దీని ద్వారా 2024 ఎన్నికల ముందు ఈ రిజర్వేషన్ అమలులోకి రాదని అర్థమవుతుంది. ఇప్పుడున్న డీలిమిటేషన్, జనాభా గణన నిబంధనలు అనుసరించి 2024 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని మేము డిమాండ్​ చేస్తున్నాము' అని అతిషి అన్నారు.
ఈ బిల్లుపై ఏఐఎమ్​ఐఎమ్​ చీఫ్​ అసదుద్దీన్​ ఒవైసీ స్పందించారు. 'మీరు ఎవరికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు? ప్రాతినిధ్యం లేని వారికి రిజర్వేషన్ కల్పించాలి. ముస్లింలకు కోటా లేకపోవడం ఈ బిల్లులో ప్రధాన లోపం. అందుకే మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాము' ఒవైసీ పేర్కొన్నారు.

  • #WATCH | Delhi: On Women's Reservation Bill, AIMIM Chief Asaduddin Owaisi says, "...Who are you giving representation to? Those who don't have representation should be given representation. The major flaw in this bill is that there is no quota for Muslim women and so we are… pic.twitter.com/LIrU5RJiaQ

    — ANI (@ANI) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మద్దతిచ్చిన బీఎస్​పీ.. కానీ..
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బహుజన్ సమాజ్​వాదీ పార్టీ-బీఎస్​పీ అధినేత్రి మయావతి మద్దతు పలికారు. ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీలకు ప్రత్యేక కోటా కోసం తమ పార్టీ డిమాండ్​ చేస్తున్నప్పటికీ.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ఏ బిల్లుకైనా తాము మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చినా తమకు ఫర్వాలేదని.. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. చర్చల తర్వాత ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ 33 శాతంలో కోటాలో వెనుకబడిన తరగతుల మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వకపోతే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కులతత్వ మనస్తత్వం ఉందని తమ పార్టీ భావించాల్సి వస్తుందని అన్నారు.

కాంగ్రెస్ తన ద్వంద్వ వైఖరి దాచలేదు : అమిత్​ షా
మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టడాన్ని బీజేపీ వర్గాలు స్వాగతించాయి. పార్లమెంటులో 'నారీ శక్తి వందన్ అధినియం' (మహిళా రిజర్వేషన్ చట్టం)ను ప్రవేశపెట్టడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహిళలకు సాధికారత కల్పించేందుకు మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ బిల్లు తెలియజేస్తోందని తెలిపారు. ఈ మహిళా బిల్లును ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని షా ఎద్దేవా చేశారు. టోకెనిజం తప్ప.. మహిళల రిజర్వేషన్​ను కాంగ్రెస్​ ఎప్పుడూ సీరియస్​గా తీసుకోలేకపోవడం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు. ఇది తమ ఘనతగా చెప్పుకోవడానికి ప్రయత్నించినా.. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి మాత్రం ఎప్పటికీ దాగదని అన్నారు.

  • Across the length and breadth of India, people are rejoicing the introduction of the Nari Shakti Vandan Adhiniyam in Parliament. It shows the unwavering commitment of the Modi Government to empower women. Sadly, the Opposition is unable to digest this. And, what is more shameful…

    — Amit Shah (@AmitShah) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వారికి వారి కుటుంబ మహిళల సాధికారతే కావాలి : స్మృతి ఇరానీ
బిల్లు లోక్​సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా పట్నాలోని బీజేపీ మహిళా కార్యకర్తలు హోలీ ఆడారు. ప్రత్యేక మహిళా ఆహ్వానితులకు పార్లమెంట్​లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వీట్లు పంచారు. గాంధీ కుటుంబానికి తమ కుటుంబంలోని మహిళలకు సాధికారత కల్పించడంపైనే ఆసక్తి ఉందని.. పేద, దళిత మహిళల్లోని మహిళలకు సాధికారత కల్పించడంపై వారికి ఆసక్తి లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్​కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సభలో సోనియా గాంధీ లేకపోవడం దురదృష్టకరమని.. ఆమె కుమారుడు కూడా వెళ్లిపోయారని మంత్రి అన్నారు. అంతేకాకుండా బిల్లుకు కాంగ్రెస్ మద్దతివ్వకపోవడం విచారకరమని అన్నారు.

  • #WATCH | Delhi: Union Minister Smriti Irani says, "Gandhi Family is only interested in empowering the women in their family. They are not interested in empowering the women in poor or Dalit women. It is unfortunate that Sonia Gandhi was absent today. Her son also left when the… pic.twitter.com/qtoZbXRobQ

  • VIDEO | Women BJP workers in Patna play Holi as they celebrate after tabling of Women’s Reservation Bill in the Lok Sabha. pic.twitter.com/cNOEBJUfa7

    — Press Trust of India (@PTI_News) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రభుత్వం మరేదైనా అంశంపై చర్చించి ఉండవచ్చు లేదా పార్లమెంటులో మరేదైనా బిల్లును ఆమోదించవచ్చు. కానీ వారు మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నారు. ఇది చాలా పెద్ద ప్రకటన అని నేను నమ్ముతున్నాను"
--కంగనా రనౌత్, బాలీవుడ్​ నటి

2026లో నేను రాజకీయాల్లోకి వస్తా : హీరోయిన్
మహిళా రిజర్వేషన్ బిల్లును నటి ఈశా గుప్తా స్వాగతించారు. 'కొత్త పార్లమెంటు మొదటి సమావేశంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం. ఇది చాలా ప్రగతిశీల ఆలోచన. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే 2026లో మీరు నన్ను రాజకీయాల్లో చూస్తారు' అని ఈశా గుప్తా అన్నారు.

  • #WATCH | Delhi: On the Women's Reservation Bill, Actress Esha Gupta says, "It's a beautiful thing that PM Modi has taken this step during the first session in the new Parliament. It's a very progressive thought...I had thought of joining politics since childhood...Let's see if… pic.twitter.com/RgKjQrN8wf

Women Reservation Bill 2023 Today in Lok Sabha : లోక్​సభ ముందుకు మహిళా బిల్లు.. ఆమోదం ఎప్పుడంటే.

Parliament Special Session 2023 : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాల పట్టు

Last Updated : Sep 19, 2023, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.