భారత సైన్యంలో మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా దక్కింది. దీంతో ఈ హోదా దక్కిన మహిళా అధికారుల సంఖ్య 424కు చేరింది. ఈ మేరకు భారత సైన్యం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు కారణాల వల్ల కొద్దిమంది మహిళా అధికారుల ఫలితాలు నిలిపివేసినట్లు పేర్కొంది.
"సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా ఇస్తూ నూతన జాబితాను విడుదల చేశాం. 147 మందికి శాశ్వత కమిషన్ హోదా దక్కింది. మొత్తంగా 615 మంది అధికారుల్లో 424 మందికి ఈ హోదా దక్కడం గమనార్హం."
--రక్షణ శాఖ.
సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి తుది తీర్పు కోసం కూడా వేచి చూస్తున్నట్లు భారత సైన్యం వెల్లడించింది. సర్వీసుతో సంబంధం లేకుండా మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలంటూ 2020, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: పురుషాధిక్యతకు చెక్.. సైన్యంలో సమన్యాయం