ETV Bharat / bharat

అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలుగా చేసి దాడి! - అప్పు చెల్లించలేదని మహిళలపై దాడి

Women Stripped: తీసుకున్న అప్పు మొత్తం ఒకేసారి చెల్లించలేదనే కారణంతో.. ఇద్దరు మహిళలను(అక్కాచెల్లెళ్లు) వివస్త్రలుగా చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరు శివారులోని సార్జాపురా పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

Women stripped, assaulted for not repaying loan, Karnataka police lodge complaint after 2 days

author img

By

Published : Jun 29, 2022, 7:26 PM IST

Women Stripped: కర్ణాటక బెంగళూరు సమీపంలోని సార్జాపుర పోలీస్​ స్టేషన్​ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. అక్కాచెల్లెళ్లను వివస్త్రలుగా మలిచి దాడి చేశారు కొందరు వ్యక్తులు. తీసుకున్న అప్పు మొత్తం ఒకేసారి చెల్లించలేదనే కారణంతో.. దారుణంగా ప్రవర్తించారు. మరో షాకింగ్​ విషయం ఏంటంటే.. రెండు రోజుల వరకు ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారట. ప్రజల ఆందోళనల అనంతరం దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులు రామకృష్ణా రెడ్డి, సునీల్​ కుమార్​ను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

ఇదీ జరిగింది: అనేకల్​ తాలుకా దూడ్డబూమ్మసంద్రకు చెందిన ఓ మహిళ తన పిల్లల చదువుల కోసం.. నేరిగ గ్రామానికి చెందిన రామకృష్ణా రెడ్డి దగ్గర రూ. లక్ష రుణం తీసుకుంది. అయితే.. మరీ అన్యాయంగా 30 శాతం వడ్డీ విధించాడు. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ వచ్చింది బాధితురాలు. కానీ తీసుకున్న రుణం మొత్తం తక్షణమే చెల్లించాలని రామకృష్ణ.. ఆమెను ఒత్తిడి చేశాడు. బాధితురాలు తన భూమిని అమ్మి.. డబ్బులు చెల్లించాల్సిందిగా గ్రామపెద్దల సమక్షంలో అంగీకారం కుదిరింది. ఈలోపే నిందితులు బాధితురాలి ఇంట్లోకి చొరబడి వివస్త్రను చేసి కొట్టారు. ఆమె సోదరిపైనా దాడి చేశారు.

అనంతరం వారు సార్జాపురా పోలీస్​ స్టేషన్​ను సంప్రదించినా.. ఇన్​స్పెక్టర్​ వారి ఫిర్యాదును తీసుకోలేదు. నిందితులతో చర్చించి.. అక్కడే సమస్య పరిష్కరించుకోవాలని బాధితులకు చెప్పారు. అయితే.. వారిపై దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​కాగా ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అనంతరం.. వారి ఒత్తిడితో మంగళవారం రాత్రి ఫిర్యాదు స్వీకరించారు. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. మరో నిందితుడి కోసం వెతుకుతున్నారు.

ఇవీ చూడండి: కూతురి మృతదేహంతో 3 రోజులు ఇంట్లోనే.. బతికించడానికి పూజలు!

మందు కొట్టి పాముతో 'ఆట'.. పురుషాంగంపై కాటుతో మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.