Women Reservation Bill President Sign : పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దీంతో మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టరూపం దాల్చింది. లోక్‌సభ, శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంట్ ఉభయసభలు ఆమోద ముద్ర వేశాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సభల్లో మహిళలకు కేంద్రం 33శాతం రిజర్వేషన్లు కల్పించింది. జనాభా లెక్కల తర్వాత చేపట్టే డీలిమిటేషన్ అనంతరం మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా ఖరారు చేసే తేదీ నుంచి ఇది అమలవుతుంది.
-
Government of India issues a gazette notification for the Women's Reservation Bill after it received the assent of President Droupadi Murmu. pic.twitter.com/GvDI2lGF1C
— ANI (@ANI) September 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Government of India issues a gazette notification for the Women's Reservation Bill after it received the assent of President Droupadi Murmu. pic.twitter.com/GvDI2lGF1C
— ANI (@ANI) September 29, 2023Government of India issues a gazette notification for the Women's Reservation Bill after it received the assent of President Droupadi Murmu. pic.twitter.com/GvDI2lGF1C
— ANI (@ANI) September 29, 2023
'నారీ శక్తి వందన్ అధినియమ్'
Nari Shakti Vandana Adhiniyam 2023 : రిజర్వేషన్ల బిల్లును 'నారీ శక్తి వందన్ అధినియమ్'గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉభయ సభల్లో అభివర్ణించారు. అధికారికంగా 106వ రాజ్యాంగ సవరణ బిల్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో ఇది ఇప్పుడు రాజ్యాంగ (106వ సవరణ) చట్టంగా మారింది. లోక్‌సభలో ఈ బిల్లుకు ఇద్దరు ఎంఐఎం ఎంపీలు మినహా అందరూ మద్దతు పలికారు. బిల్లుపై సెప్టెంబర్ 20న లోక్‌సభలో 8 గంటల సుదీర్ఘ చర్చ జరిగింది. ఓటింగ్‌లో మొత్తం 454 మంది పాల్గొన్నారు. 452 మంది మద్దతు పలకగా... రెండు ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. బిల్లుపై విపక్షాలు పలు సవరణలు ప్రవేశపెట్టగా.. అవన్నీ వీగిపోయాయి.
రాజ్యసభలో సెప్టెంబర్ 21న ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రాజ్యసభలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేపట్టిన ఓటింగ్‌లో.. ఈ సభ్యులంతా ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు పలుకుతూ ఓటేశారు. సభలోని మొత్తం 215 మంది అనుకూలంగా ఓటు వేయడం వల్ల పార్లమెంట్ గడప దాటినట్లైంది. తద్వారా మూడు దశాబ్దాల మహిళా నిరీక్షణకు తెరపడినట్లైంది. మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేసే ఈ బిల్లు 27 ఏళ్ల పాటు.. పార్లమెంట్ గడప దాటేందుకు ఎదురుచూస్తూ వచ్చింది. ప్రధాన మంత్రులుగా పనిచేసిన దేవెగౌడ, వాజ్‌పేయీ, పీవీ, మన్మోహన్ వంటివారు ఈ బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవన్నీ విఫలమయ్యాయి. అసలు ఈ బిల్లు చరిత్ర గురించి తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.