ETV Bharat / bharat

సరిహద్దుల్లో అక్రమ రవాణాకు చెక్​ పెడుతున్న వీరనారులు

women in defence: సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్ఠం చేస్తున్నారు ఆర్మీ అధికారులు. పెట్రోలింగ్​ సమయంలో అక్రమ రవాణాను అడ్డుకునేదంకు మహిళా కానిస్టేబుళ్లును రంగంలోకి దించారు. దీంతో బార్డర్​లో స్మగ్లింగ్​ చేసే మహిళలకు వీరితో చెక్​ పడినట్లు అయ్యింది.

women in defence
వీరనారులు
author img

By

Published : Jan 2, 2022, 11:55 AM IST

Updated : Jan 2, 2022, 12:15 PM IST

women in defence: భారత్​- బంగ్లాదేశ్ సరిహద్దులో పెట్రోలింగ్‌ను మరింత పటిష్ఠం చేసింది సైన్యం. సరిహద్దుల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్న మహిళలను తనిఖీ చేసేందుకు లేడీ కానిస్టేబుళ్లను నియమించినట్లు సరిహద్దు భద్రతా దళ అధికారి తెలిపారు.

"ఇది భారత్​-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ఉండే గ్రామంలో చాలా భాగం మన దేశానికి చెందింది. దీనిలో సుమారు 56 మంది మహిళలు ఉన్నారు. వీరు రోజు బంగ్లాదేశ్​కు ప్రయాణిస్తుంటారు. వారు భారత్​లోకి ప్రవేశించే సమయంలో తనిఖీలు చేయాలి. అందుకే మహిళా కానిస్టేబుళ్లను సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం"

- సుహాసిని పుహాన్, సరిహద్దు భద్రతాదళ సిబ్బంది.

సరిహద్దు గ్రామాలకు కొన్ని మీటర్ల దూరంలో బంగ్లాదేశ్ ఉండడం కారణంగా కొంతమంది గ్రామస్థులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సుహాసిని తెలిపారు. అయితే స్థానికంగా ఉండే మహిళలు దేశంలోకి అక్రమంగా రవాణా చేయకుండా చూసేందుకు నిరంతరం తనిఖీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా అధికారులు రైడ్స్​ నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారికి తోడుగా వెళ్లనున్నట్లు వివరించారు.

women in defence
విధులు నిర్వహిస్తున్న మహిళా జవానులు

భారత్​- బంగ్లాదేశ్​ సరిహద్దు ప్రాంతంలో చాలా ప్రాంతాలకు కంచె లేని కారణంగా అక్రమ రవాణాకు అవకాశం ఉంది. స్మగ్లర్లు కూడా రాత్రి పూట అక్రమాలకు​ పాల్పడుతారు. దీంతో గస్తీ మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. ఇందుకుగానూ సరహద్దు వెంబడి ఉన్న హరిదాస్‌పుర్-జయంతీపుర్ బార్డర్​లో 36 మంది మహిళా కానిస్టేబుళ్లను సైన్యం నియమించింది.

women in defence
మహిళా కానిస్టేబుళ్ల విధులను వివరిస్తున్న మహిళా జవాను

పంజాబ్​ సరిహద్దుల్లో వీరనారులు..

పంజాబ్​ గురుదాస్​పుర్​ జిల్లాలో ఉండే 138 కి.మీ సరిహద్దు వెంబడి మహిళా జవానులు విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దు వెంబడి ఉండే రావి నది ప్రాంతంలో వీరు నిరంతరం గస్తీ కాస్తున్నారు. బార్డర్​లో శత్రువుల కదలికను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి:

ఈ ఘరానా దొంగపై 80 కేసులు.. 17వ సారి అరెస్టు

Last Updated : Jan 2, 2022, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.