ETV Bharat / bharat

'నా భర్త లిప్​స్టిక్​ పెట్టుకుని.. ఆడవారి లోదుస్తులు వేసుకుని..'.. పోలీసులకు మహిళ ఫిర్యాదు - women complaint against husband

తన భర్త లిప్​స్టిక్​ పూసుకుంటున్నాడని.. మహిళల లోదుస్తులు ధరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. అదనపు కట్నం తీసుకురావాలని అత్తామామలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. తర్వాత ఏం జరిగందంటే?

women complaints about husband
women complaints about husband
author img

By

Published : Apr 1, 2023, 10:52 AM IST

Updated : Apr 1, 2023, 10:58 AM IST

కర్ణాటకలోని బెంగళూరులో విచిత్రమైన కేసు నమోదైంది. ఓ మహిళ తన భర్త లిప్‌స్టిక్‌ రాసుకుని.. మహిళలు ధరించే లోదుస్తులు వేసుకుంటాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. మహిళలు ధరించే దుస్తుల్లో వింతగా ప్రవర్తించడమే కాకుండా తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ తన భర్త, అతడి కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసింది. దీంతో షాక్​కు గురైన పోలీసులు.. వరకట్న వేధింపులు కింద ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు.

మాట్రిమోని టూ మ్యారేజ్​!..
నిందితుడు మూడేళ్ల క్రితం ఓ మ్యాట్రిమోని వెబ్​సైట్​లో ఆమెకు పరిచయం అయ్యాడు. తాను ఎంటెక్ చేసి మంచి ఉద్యోగంలో ఉన్నానని చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు కలవడం వల్ల.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో ఇద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో ఆమె కుటుంబం.. 800 గ్రాముల బంగారం, కేజీ వెండి, రూ.5 లక్షలను కట్నంగా ఇచ్చారు.

మొదటి రాత్రి​ రోజే బయటపడిన అసలు నిజం!
మొదటి రాత్రి రోజే ఆమెకు తన భర్త సంబంధించి అసలు విషయం తెలిసి షాక్​కు గురైంది. ఆమె భర్త అద్దం ముందు నిలబడి తన పెదాలకు లిప్​స్టిక్ రాసుకున్నాడు. ఆ తర్వాత మహిళల లోదుస్తులు ధరించాడు. ఈ వింత చేష్టలు చూసిన ఆమె.. ఇదేంటని భర్తను ప్రశ్నించింది? తనకు మగవాళ్లంటే చాలా ఇష్టమనే అసలు నిజాన్ని బయటపెట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.

కరోనా సమయంలో వీరి పెళ్లి జరిగినందున.. పెళ్లైన వెంటనే దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించారు. దీంతో ప్రతిరోజూ వీరి మధ్యలో గొడవలు జరిగేవి. దీంతోపాటుగా ఒకరోజు తన అత్త ఆమెపై బొద్దింకలను చంపడానికి వాడే మందు స్ప్రే చేసింది. అస్వస్థతకు గురైన ఆమె అనారోగ్యం బారిన పడింది. ఓ పక్క భర్త వింత ప్రవర్తన రోజు రోజుకూ పెరిగిపోవడం.. మరోవైపు అత్తమామలు అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలుపెట్టారు. తమ కుమారుడిని ఆస్పత్రిలో చూపించడానికి రూ.10 లక్షలు తీసుకువాలని ఆమెను వేధించేవారు. అత్తింటివారు పెట్టే వేధింపులు​ భరించలేక ఆమె ఒకరోజు ఇంటి నుంచి వెళ్లిపోయి.. తన బంధువుల ఇంటికి చేరుకుంది. అయితే ఆమె అక్కడకు వెళ్లినా సరే భర్త, అత్తమామలు తనను మానసికంగా వేధించేవారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆమెను వేధించిన ఆ ముగ్గురిపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

గతంలో ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్​లో కూడా వెలుగుచూసింది. ఓ మహిళ.. తన భర్త ఆడవారిలా రెడీ అవుతూ.. పెళ్లై రెండేళ్లు గడిచినా తనతో లైంగిక సంబంధం పెట్టుకోలేదని కోర్టును ఆశ్రయించింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఆమె కోర్టులో సమర్పించింది. విచారణ చేపట్టిన కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Apr 1, 2023, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.