ETV Bharat / bharat

మూడో భర్తకు రెడ్‌ హ్యాండెడ్‌గా.. మొదటి ఇద్దరు భర్తలతో ఉండగా.. - కర్ణాటక వార్తలు తాజా

Women Caught Red Handed: ఓ యాప్‌ ద్వారా యువకులతో పరిచయం పెంచుకుని వారితో ప్రేమ.. పెళ్లితో మోసాలకు పాల్పడుతున్న ఘరానా లేడీని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె.. తన మూడో భర్తకు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడటంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Women Caught Red Handed
నిందితురాలు నిఫా ఖాన్
author img

By

Published : Mar 24, 2022, 12:20 PM IST

Updated : Mar 24, 2022, 4:24 PM IST

Women Caught Red Handed: ఆమె పేరు నిఫా ఖాన్‌. ఆమె పరిచయం కోసం ఎదురుచూసే యువకుల పాలిట ఆమె కలలరాణి. అందంతో అంతగా కట్టిపడేస్తుందంటారు. ఇక అసలు విషయానికొస్తే.. రాచనగరి మైసూరులోని ఉదయగిరి ప్రాంతానికి చెందిన నిఫా ఖాన్‌ ఇటీవలే రాజీవ్‌ నగరకు చెందిన అజామ్‌ ఖాన్‌ అనే యువకుడిని వివాహం చేసుకుంది. అప్పటి వరకు జరిగిన రెండు వివాహాల సంగతి అత్యంత గోప్యంగానే ఉంచి మూడో వివాహం చేసుకుంది.

ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకున్నా ఇద్దరు భర్తలను తరచూ కలుసుకుంటూ ఉండేదట. అంతేకాదండోయ్‌.. ఓ యాప్‌ ద్వారా యువకులతో పరిచయం పెంచుకుని వారితో ప్రేమాయణాన్ని కొనసాగించేదని పోలీసు అధికారులు వివరించారు. ఫోన్‌లోనే ఎక్కువకాలం గడిపే భార్యను చూసి అజామ్‌ఖాన్‌కు అనుమానమొచ్చినా ఆమె అందానికి గులాముగా మారిన ఆయన చూసీ చూడనట్టుగా ఉండేవారట. పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవడంతో ఆమె వ్యవహారాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చూడండి : ముగ్గురు భార్యల బంగార్రాజు కేసులో ట్విస్ట్​.. రెండో ఆమెనే స్కెచ్ వేసి...

Last Updated : Mar 24, 2022, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.