ETV Bharat / bharat

మాస్క్​ లేదని జరిమానా- మార్షల్​పై మహిళ దాడి - ముంబయి కరోనా

మాస్క్​ లేని కారణంగా ఓ మహిళకు జరిమానా విధించారు ప్రత్యేక దళం సిబ్బంది. జరిమానా చెల్లించమని అడిగినందుకు మార్షల్​పై దాడికి పాల్పడింది సదరు మహిళ. ఈ ఘటన ముంబయిలోని కండివాలి ప్రాంతంలో జరిగింది.

attack
attack
author img

By

Published : Mar 20, 2021, 12:36 PM IST

Updated : Mar 20, 2021, 1:07 PM IST

మాస్క్​ ధరించలేదని జరిమానా విధించిన మహిళా మార్షల్‌పై ఓ మహిళ దాడి చేసింది. ఈ ఘటన ముంబయిలోని కండివాలిలో శనివారం జరిగింది. మార్షల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

జరిమానా విధించినందుకు మహిళ మార్షల్​పై దాడి

కరోనా పెరుగుదల దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం మాస్క్​ తప్పనిసరి చేసింది. బృహన్ ముంబయి కార్పొరేషన్‌ మాస్కులేకుంటే జరిమానా వసూలు చేస్తోంది. నిబంధనలు అమలు చేసేందుకు ప్రత్యేక మార్షల్స్‌ను నియమించింది. కండివాలిలో మహావీర్నగర్ లింక్ రోడ్ వద్ద జయనాద్ షేక్ అనే మహిళ.. మాస్క్​ లేకుండా బయటకు వెళ్లింది. గమనించిన అశ్విన్ గుంజన్ అనే మహిళా మార్షల్‌ జయనాద్ షేక్‌కు రూ. 200 జరిమానా విధించారు. జరిమానా కట్టమని అడిగినందుకు.. మార్షల్‌పై జయనాధ్ షేక్ దాడి చేసింది. మార్షల్ అశ్విని ఫిర్యాదు మేరకు జయనాద్‌ షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి : మహిళల వస్త్రధారణ వ్యాఖ్యలపై రావత్ క్షమాపణ.. కానీ!

Last Updated : Mar 20, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.