బిహార్లో జుడీషియల్ కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి జైలులో మృతిచెందటం వల్ల అతని గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీరిని నిలువరించే ప్రయత్నంలో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా, పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
జహానాబాద్ జిల్లా పరస్బిగా పోలీసు స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం కేసులో గోవింద్ మాంఝీని ఇటీవల అరెస్టు చేశారు. కోర్టు అతనికి జుడీషియల్ కస్టడీ విధించగా.. సమీపంలోని ఔరంగాబాద్ జిల్లా జైలులో ఉంచారు. శుక్రవారం జైల్లోనే గోవింద్ మృతిచెందాడు.
ఆయుధాలతో కాల్పులు..
పోలీసులు కొట్టడం వల్లే గోవింద్ చనిపోయాడంటూ గ్రామస్థులు జహానాబాద్- అర్వాల్ జాతీయ రహదారిపై శనివారం ధర్నాకు దిగారు. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు.
కొందరు లైసెన్సు లేని ఆయుధాలతో కాల్పులు జరపటం వల్ల పరిస్థితి అదుపు తప్పింది. పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మహిాళా కానిస్టేబుల్ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. దాడికి పాల్పడిన వారిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: Tragedy: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి.. 9మంది మృతి