ETV Bharat / bharat

మహిళ మెడలో చెప్పుల దండ వేసి.. నగ్నంగా ఊరేగించి.. - Woman paraded naked news

వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను అత్యంత దారుణంగా శిక్షించారు గ్రామస్థులు. ఆమె మెడలో చెప్పులదండ వేసి నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Woman paraded naked in Jharkhand village over affair with married man
మహిళ మెడలో చెప్పుల దండ వేసి నగ్నంగా ఊరేగిం
author img

By

Published : Aug 21, 2021, 5:46 PM IST

ఝార్ఖండ్ దుమ్కా జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. పెళ్లైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో ఓ మహిళ మెడలో చెప్పుల దండ వేసి నగ్నంగా ఊరేగించారు స్థానికులు. రానిశ్వర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

వివాహిత అయిన ఈ మహిళ పెళ్లైన మరో వ్యక్తితో పరారైంది. విషయం తెలుసుకున్న అతని భార్య తరఫు బంధువులు ఇద్దరినీ బుధవారం రాత్రి పట్టుకున్నారు. అనంతరం మహిళను దారుణంగా కొట్టి వివస్త్రను చేశారు. అనంతరం చెప్పుల దండతో ఊరేగించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం 12మందిని నిందితులుగా ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. ఆరుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: హెడ్​ మాస్టర్​ మెడలో చెప్పుల దండ- గ్రామం మొత్తం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.