ETV Bharat / bharat

'నేను పార్వతి అవతారం.. శివుడిని పెళ్లి చేసుకుంటా.. లేకుంటే చస్తా!' - Woman marry lord shiva

Woman Lord Shiva marriage: పార్వతీ దేవి అవతారం అంటూ ఓ మహిళ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతానికి వెళ్లి తిరిగి రానంటూ మొండికేసింది. శివుడిని పెళ్లిచేసుకుంటానని చెబుతోంది.

Woman Marrying Shiva:
Woman Marrying Shiva:
author img

By

Published : Jun 5, 2022, 10:06 AM IST

Woman Marrying Shiva: పార్వతి అవతారంగా పేర్కొంటూ ఓ మహిళ.. పోలీసులకు చుక్కలు చూపించింది. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఆ మహిళ శివుడిని పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. అక్కడి నుంచి తిరిగి రానని మొండికేసింది. తనను బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.

ఉత్తర్​ప్రదేశ్ లఖ్​నవూకు చెందిన హమిందర్ సింగ్ అనే మహిళ.. ఇండియా-చైనా సరిహద్దులోని నాభిదంగ్ ప్రాంతానికి వెళ్లింది. అధికారుల నుంచి అనుమతి తీసుకొని 15రోజుల పాటు దర్చులాలోని గుంజి ప్రాంతంలో ఉండేందుకు తన తల్లితో పాటు వెళ్లింది. మానస సరోవర్ యాత్రకు వెళ్లే దారిలో ఈ ప్రాంతం ఉంటుంది. అయితే, మే 25 వరకే వీరు అక్కడ ఉండేందుకు అనుమతి ఉంది. గడువు తేదీ దాటినా.. మహిళ తిరిగి రాలేదు. దీంతో పోలీసుల బృందం మహిళ ఉండే చోటికి వెళ్లింది. వారిని వెళ్లిపోవాలని పోలీసులు అడిగారు. అయితే మహిళ ఇందుకు నిరాకరించింది. ఇక్కడే ఉంటానని చెప్పుకొచ్చింది. తాను పార్వతిదేవి మరో అవతారం అని, బలవంతంగా ఇక్కడి నుంచి పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. ఒట్టిచేతులతో వెనుదిరిగారు.

మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని పితోరాగఢ్ ఎస్పీ లోకేంద్ర సింగ్ తెలిపారు. ఆమెను వెనక్కి తీసుకొచ్చేందుకు పెద్ద బృందాన్ని పంపించినట్లు స్పష్టం చేశారు. 12 మంది పోలీసులతో కూడిన టీమ్​ను నాభిదంగ్​కు వెళ్లి మహిళను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.