ETV Bharat / bharat

భర్తతో కలిసి స్నేహితురాల్ని చంపి.. మృతదేహాన్ని బ్యాగ్​లో చుట్టి.. - కపిల్​నగర్​

Woman killed by friend: అప్పు​ తీర్చే విషయంలో వివాదం రావడం వల్ల ఓ మహిళను ఆమె స్నేహితురాలు గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం నిందితురాలు, ఆమె భర్త కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి పొదల్లో పడేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్​పుర్​ సమీపంలోని కపిల్​నగర్​ ప్రాంతంలో సోమవారం జరిగింది.

Woman killed by friend
స్నేహితురాలిని హత్య చేసిన మహిళ
author img

By

Published : Mar 29, 2022, 7:08 AM IST

Woman killed by friend: లోన్​ తీర్చే విషయంలో వివాదం రావడం వల్ల ఓ మహిళను ఆమె స్నేహితురాలు గొంతు కోసి హత్య చేసింది. నిందితురాలు, ఆమె భర్త కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి పొదల్లో పడేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్​ సమీపంలోని కపిల్​నగర్​ ప్రాంతంలో సోమవారం జరిగింది.

మృతురాలు దీపా జుగల్ దాస్ (41) పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తోంది. దీప.. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తర్వాత నుంచి కనిపించలేదు. ఆదివారం రాత్రి దీపా మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. ఇదిలా ఉండగా.. ఉప్పల్‌వాడి ప్రాంతంలో ప్లాస్టిక్ సంచిలో ఒక మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం దీపదిగా గుర్తించారు.

స్వర్ణ దగ్గర దీప రూ.లక్ష లోన్ తీసుకుందని పోలీసు విచారణలో తేలింది. ఈ లోన్​ను తిరిగి చెల్లించే విషయంలో వీరివురి మధ్య గొడవ జరిగింది. దీంతో సోని ఇంట్లో ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. కోపంలో దీపను సోని కత్తితో గొంతుకోసి హత్య చేసింది. ఆపై భర్త సమీతో కలిసి ఉప్పల్‌వాడిలోని పొదల్లో మృతదేహాన్ని పడేసిందని పోలీసులు తెలిపారు. మృతురాలు దీప చివరిసారిగా స్వర్ణ ఇంట్లో కనిపించడం, మొబైల్ ఫోన్ రికార్డుల ఆధారంగా నిందితురాలు స్వర్ణను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్వర్ణ దంపతులపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. నిందితులను మార్చి 31 వరకు కస్టడీలోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: యువకుడిపై పోలీసు అత్యాచారం.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.