Woman jumps into well with kids: మహారాష్ట్రలో అత్యంత విషాద ఘటన వెలుగు చూసింది. భర్తతో గొడవపడిన ఓ మహిళ ఘోర నిర్ణయం తీసుకుంది. తన నలుగురు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
అసలేమైందంటే..?
Maharashtra jalna news: జల్నా జిల్లా ఘుంగర్డే హడ్గావ్ ప్రాంతానికి చెందిన జ్ఞానేశ్వర్ ప్రల్హాద్ అడాణీ, గంగసాగర్ అడాణీ దంపతులు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా జ్ఞానేశ్వర్, గంగసాగర్ మధ్య తరచూ గొడవలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గంగసాగర్ తన పిల్లలతో కలిసి పొలం వద్దకు వెళ్లింది. సాయంత్రం 5:30 గంటల వరకు ఆమె అక్కడే ఉంది.
అయితే.. రాత్రి 7 గంటలైనప్పటికీ గంగసాగర్ తిరిగి ఇంటికా రాలేదు. దాంతో ఆమె భర్త సహా గ్రామస్థులు గంగసాగర్తో పాటు పిల్లల కోసం అర్ధరాత్రి వరకు వెతికారు. అయినప్పటికీ.. వారి ఆచూకీ కనిపించలేదు. అయితే... శనివారం ఉదయం జ్ఞానేశ్వర్ అడాణీ పొలానికి సమీపంలోని ఓ బావిలో గంగసాగర్ సహా ఆమె పిల్లలు మృతదేహాలు తేలుతూ కనిపించాయి.
సమాచారం అందిన వెంటనే.. ఇన్స్పెక్టర్ శీతల్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. బావి నుంచి.. గంగసాగర్తో పాటు భక్తి(13), ఈశ్వరి(11), అక్షర(9), యువరాజ్(7) మృతదేహాలను బయటకు తీశారు. గంగసాగర్ అడాణీ భర్త జ్ఞానేశ్వర్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: చెన్నైలో భారీ వర్షాలు- విద్యుదాఘాతానికి ముగ్గురు బలి
ఇదీ చూడండి: పాపం.. ప్రాణాలు తీసిన నకిలీ బ్యాంక్ అకౌంట్!