ETV Bharat / bharat

మహిళా పారిశ్రామికవేత్తపై అత్యాచారం.. ప్రైవేటు వీడియోలతో బెదిరింపులు.. - Woman industrialist raped in maharashtra

మహిళా పారిశ్రామికవేత్తపై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. ఆమె ప్రైవేట్ వీడియోలను తీశాడు. దీంతో ఆమెను బెదిరించి దాదాపు రూ.3 కోట్లు వసూలు చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.

Woman industrialist raped in maharashtra
మహిళ పారిశ్రామికవేత్తపై అత్యాచారం
author img

By

Published : Mar 7, 2023, 10:51 PM IST

ఓ మహిళా పారిశ్రామికవేత్తను పదే పదే లైంగికంగా వేధించాడు ఓ వ్యక్తి. మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రహస్యంగా ఆమె ప్రైవేటు వీడియోలు తీసి.. బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఆమె నుంచి మూడు కోట్ల రూపాయలు వసూలు చేశాడు. మరో రూ.2 కోట్ల రూపాయలు డిమాండ్​ చేశాడు. అందుకు నిందితుడి భార్య, అతడి మామ, సోదరుడు కూడా సహకరించారు. అతని ఆగడాలు భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తి, అతని బంధువులపై ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
38 ఏళ్ల మహిళను ధర్మేంద్ర మిశ్రా అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తకు సొంతంగా రిఫైనరీ అండ్​ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. ఆమెకు ఆ కంపెనీకి వైస్​ ప్రెసిడెంట్​గా పనిచేస్తోంది. మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​.. బాధితురాలి సొంతూరు.

కొద్ది నెలల క్రితం బాధితురాలికి ధర్మేంద్ర మిశ్రా పరిచయం అయ్యాడు. వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. ధర్మేంద్ర ఆమెకు పెళ్లి ప్రపోజల్​ కూడా చేశాడు. తన భార్యకు విడాకులు ఇస్తానని, ఆమెను కూడా భర్తకు విడాకులు ఇవ్వాలని చెప్పాడు. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. దీనికి ఆమె తిరస్కరించింది. అతడితో సంబంధాన్ని తెంచుకుంది. మళ్లీ కొద్ది రోజులకు బాధితురాలిని కలిసిన ధర్మేంద్ర.. తనను క్షమించమని కోరాడు. తనతో స్నేహాన్ని కొనసాగించమని వేడుకున్నాడు. దానికి ఆమె అంగీకరించింది. కాగా కొన్ని రోజులకు ఈ మొత్తం విషయాన్ని బాధితురాలు.. 2022 ఏప్రిల్​లో ధర్మేంద్ర భార్య మోనిక మిశ్రాకు చెప్పింది.

మత్తు మందు ఇచ్చి అత్యాచారం..
కొన్నాళ్ల క్రితం ధర్మేంద్ర బాధితురాలి ఇంటికి వెళ్లాడు. ఆమెకు మత్తు మందు కలిపిన జ్యూస్​ను తాగించాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. నగ్నంగా ఉన్న ఆమె వీడియోలు సైతం తీశాడు. వాటిని ఆధారంగా చేసుకుని ఆమెపై వేధింపులు జరిపాడు. డబ్బులు డిమాండ్​లు చేశాడు. ఇవ్వకపోతే వీడియోలు వైరల్​ చేస్తానని.. బాధితురాలి భర్త, పిల్లలను చంపుతానని బెదిరించాడు.

నిందితుడి భార్య, అతడి మామయ్య ఓం ప్రకాశ్​, సోదరుడు దేవాంగ్​ కూడా వీడియోల సాకుతో బాధితురాలిని బెదిరించారు. నగ్న పోటోలతో ఆమె నుంచి డబ్బులు డిమాండ్​ చేశారు. దీంతో భయపడ్డ ఆమె.. వారికి మూడు కోట్ల రూపాయలు చెల్లించింది. వీడియోలను సాకుతో బాధితురాలిపై.. ధర్మేంద్ర తరుచూ లైంగిక దాడికి పాల్పడేవాడు. ఆమెను తీవ్రంగా హింసించేవాడు. ఒక రోజు మోనికా, ఓంప్రకాశ్​, దేవాంగ్​లతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాడు ధర్మేంద్ర. ఆమెపై బ్యాట్, హాకీ స్టిక్‌తో దాడి చేశాడు. ఈ ఘటన బాధితురాలు మధ్యప్రదేశ్​లో ఉన్నప్పుడు జరిగింది. దీంతో ఈ నలుగురిపై బాధితురాలు మధ్యప్రదేశ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ తరువాత కొద్ది రోజులకు బాధితురాలు ముంబయికి తిరిగి వచ్చింది. ఫిబ్రవరి 25న షాపింగ్​కు వెళ్లింది. అదే సమయంలో తన భార్యతో ధర్మేంద్ర అక్కడికి వచ్చాడు. వారిద్దరూ బాధితురాలికి తన ప్రైవేటు వీడియోను చూపించారు. మరో రూ.10 లక్షలు డిమాండ్​ చేశారు. వారి ఆగడాలు మరింత పెరగడం వల్ల ముంబయి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.