ETV Bharat / bharat

రైల్వేస్టేషన్​లో యువతిపై సామూహిక అత్యాచారం - Delhi Crime news

దిల్లీలో అత్యాచారాలు ఆగడం లేదు. ఓ యువతిపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Women gang-raped in Delhi railway station
దిల్లీ రైల్వేస్టేషన్​లో యువతిపై సామూహిక అత్యాచారం
author img

By

Published : Dec 14, 2020, 11:49 AM IST

దేశంలో వరుస అత్యాచార ఘటనలు ఆగడం లేదు. దిల్లీ​లో ఇటీవల ఓ యువతిపై జరిగిన గ్యాంగ్​రేప్​ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

షకూర్​బస్తీ రైల్వేస్టేషన్​లో ఈ నెల 10న ఓ యువతిపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 3గంటలకు జరిగిన ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. స్థానిక అధికారుల సాయంతో ఆమెను మంగోల్​పురిలోని సంజయ్​గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం.. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అదే రోజే రైల్వేస్టేషన్​ క్యాటరింగ్​ స్టాల్​లో దోపిడీ జరిగింది. ఆ దుండగులే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ 24 గంటలు గస్తీ కాసే రైల్వేస్టేషన్​లో ఇలాంటి ఘటన జరగడం విస్మయానికి గురి చేస్తోంది.

ఇదీ చదవండి: యూపీలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం- ఇద్దరి అరెస్ట్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.