ETV Bharat / bharat

సిద్దరామయ్యకు చేదు అనుభవం.. రూ. 2 లక్షలు విసిరికొట్టిన మహిళ!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బాగల్​కోటె పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం ఇవ్వగా ఓ ముస్లిం మహిళ ఆయన ఎస్కార్ట్​పైకి విసిరేసింది.

sidharamaiah
కాంగ్రెస్ నేత సిద్ధారామయ్య
author img

By

Published : Jul 15, 2022, 3:06 PM IST

సిద్దరామయ్యకు చేదు అనుభవం

కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. కెరూర్ ఘటనలో గాయపడినవారికి పరామర్శించేందుకు ఆయన బాగల్​కోటేలోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ క్షతగాత్రుని కుటుంబానికి రూ.2 లక్షలను నష్టపరిహారాన్ని ఇచ్చి ఆయన కారు ఎక్కుతుండగా ఓ ముస్లిం మహిళ ఎస్కార్ట్ వాహనంపైకి ఆ డబ్బులను విసిరేసింది.

'ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లు అడిగేందుకు వస్తారు. ఇప్పుడు మన సమస్యలేవీ పట్టించుకోరు. హిందువులైనా, ముస్లింలైనా అందర్ని సమానంగా చూడాలి. కానీ మేం ఏ తప్పు చేయకపోయినా.. కారణం లేకుండా మా వారిపై దాడి చేశారు. ఈరోజు పరిహారం ఇస్తారు. గాయపడిన మా వారు ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలి. డబ్బు మా సమస్యకు పరిష్కారం కాదు. భిక్షాటన చేసి అయిన మా కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నాం.'

-ముస్లిం మహిళ

కెరూర్​లో ఈవ్ టీజింగ్ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని కత్తితో పొడిచారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు సంబంధించిన 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి: దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​.. హెచ్​సీయూ ర్యాంక్ ఎంతంటే...

కొడుకు పుడితే నరబలి ఇస్తానని మొక్కులు.. 18 ఏళ్ల యువకుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.