ETV Bharat / bharat

'ట్యాక్స్​ కడితే.. రూ.55వేల కోట్ల డీల్​లో 40% షేర్  ఇస్తాం'- మహిళకు టోకరా!

Woman duping case: 'ఆర్​బీఐ వద్ద రూ.55వేల కోట్లు ఫ్రీజయ్యాయి. ట్యాక్స్​ కట్టేందుకు రూ.27 కోట్లు కావాలి. ఆ నగదు సమకూరుస్తే 40 శాతం షేర్​ ఇస్తాం' అని నమ్మించి ఓ మహిళను మోసం చేశారు కొందరు దుండగులు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

Woman duping case
మహిళకు టోకరా
author img

By

Published : Jan 8, 2022, 10:54 AM IST

Woman duping case: పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో కేటుగాళ్ల మాయలోపడుతున్నారు కొందరు. బ్యాంకులో నగదు ఫ్రీజ్​ అయింది.. ట్యాక్సులు కడితే డబ్బులు వస్తాయని చెప్పి అందినకాడికి దండుకుంటున్నారు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. కెనడాకు చెందిన ఓ సంస్థకు విలువైన ఖనిజం అమ్మటం ద్వారా రూ.55,000 కోట్లు వచ్చాయని కట్టుకథ అల్లి ఓ మహిళను మోసం చేశారు కొందరు దుండగులు. అందులో 40శాతం షేర్​ ఇస్తామని, అందుకు ఆర్​బీఐకి రూ. 27 కోట్లు ట్యాక్స్​ కట్టాలని నమ్మించి టోకరా వేశారు.

ఇదీ జరిగింది..

ఈనెల 5వ తేదీన బాధిత మహిళ.. భాస్కర రావు యోసుపోగు అనే వ్యక్తిని జుహు ప్రాంతంలోని ఓ హోటల్​లో కలిసింది. ఈ క్రమంలో కెనడాకు చెందిన ఓ సంస్థకు విలువైన ఖనిజం అమ్మటం ద్వారా తమకు 6.7 బిలియన్​ యూరోలు వచ్చాయని(సుమారు రూ.55వేల కోట్లు) ఆమెను నమ్మించారు. ఈ నగదును ఆర్​బీఐలోని విదేశీ వ్యవహారాల విభాగం నిలిపివేసిందని, ఆ డబ్బులు రావాలంటే రూ.27 కోట్లు ట్యాక్స్​ కట్టాలని చెప్పారు. ఆ డబ్బులు ఇస్తే.. వచ్చే నగదులో 40శాతం షేర్​ ఇస్తామన్నారు. దుండగుల మాయలో పూర్తిగా మునిగిపోయిన మహిళ.. తన వద్ద ఉన్న రూ.30,000 వారికి ఇచ్చింది. మిగిలిన డబ్బులను గురువారం ఇస్తానని చెప్పింది.

ఈ విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు.. ఇది పెద్ద స్కామ్​ అని చెప్పటంతో మోసపోయానని తెలుసుకుని భందుప్​ పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 420,465, 467, 468, 471, 120(బీ), 34 ప్రకారం కేసు నమోదు చేశారు.

నలుగురు అరెస్ట్​..

నిందుతుల కోసం గాలింపు చేపట్టిన క్రైమ్​ బ్రాంచ్​ 7 బృందం.. ట్రాప్​ చేసి యోసుగోపు సహా మరో ముగ్గురిని అరెస్ట్​ చేసింది. భాస్కరరావు యోసుగోపు, ఆరిందమ్​ అటింద్రకుమార్​ దేయ్​, రాజ్​వింద్ర మెహ్రా, సుమిత్​ కమాల్​ పంజాబి, నియాజ్​ అలియాస్​ కబిర్​లు.. బోగస్​ పత్రాలు సృష్టించి.. ఆర్​బీఐ, డీఆర్​డీఓ, రక్షణ శాఖ, బార్క్​, ఇస్రో, రా విభాగాలతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ అమాయకును మోసం చేస్తున్నట్లు తేల్చారు.

ఇదీ చూడండి:

ఫేక్​​ ఫ్రెండ్​ - మహిళకు రూ.42 లక్షలు టోకరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.