Woman Dumps Baby Toilet: అప్పుడే పుట్టిన బిడ్డపై కర్కశత్వం ప్రదర్శించింది ఆ కన్నతల్లి. చిన్నారిని చంపి.. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ మృతదేహాన్ని టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్లో వేసింది. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.
ఏం జరిగిందంటే..?
తమిళనాడు, తంజావూరుకు చెందిన ప్రియదర్శిని(23)కి వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. వివాహేతర సంబంధం బయటపడుతుందని భావించిన మహిళ చిన్నారిని చంపింది. ఆ తర్వాత తంజావూరు మెడికల్ కాలేజీలోని ఓ టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్లో మృతదేహాన్ని వేసింది. డిసెంబరు 4న టాయిలెట్లోకి నీళ్లు రావడంలేదని గ్రహించిన ఆస్పత్రి సిబ్బంది.. ఫ్లష్ ట్యాంకు తెరిచిచూడగా అందులో శిశువు మృతదేహం కనిపించింది.
దీంతో షాక్కు గురైన ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. డిసెంబరు 3న ఓ మహిళ ఘటన జరిగిన టాయిలెట్ గది వద్ద, ఐసీయూ వార్డు దగ్గర తిరిగినట్లు గుర్తించారు.
సీసీటీవీ ఫుటేజ్, ఇంకొన్ని ఆధారాలతో ప్రియదర్శినిని సోమవారం అరెస్ట్ చేశారు పోలీసులు. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో నిందితురాలిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఇదీ చూడండి: ఎన్జీఓలో పనిచేసే యువతిపై గ్యాంగ్ రేప్.. మనస్తాపంతో..