ETV Bharat / bharat

'యూపీ రేప్​ కేసులో బాధితురాలు ఆత్మహత్య' - ఉత్తరప్రదేశ్​ సంభాల్​ జిల్లాలోని గ్రామ్​పురా గ్రామంలో రేప్​ కేసు బాధితురాలు మృతి

ఉత్తరప్రదేశ్​ సంభాల్​ జిల్లాలోని బాహ్​జోయి పోలీసు స్టేషన్​ పరిధిలో తనపై అత్యాచారం చేశారని కేసు నమోదు చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించిందని పోలీసులు తెలిపారు. అత్యాచారంపై ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.

Woman dies by suicide in UP's Sambhal after registering rape case
'యూపీ రేప్​ కేసులో బాధితురాలు ఆత్మహత్య'
author img

By

Published : Mar 5, 2021, 1:21 PM IST

ఉత్తరప్రదేశ్​ సంభాల్​ జిల్లాలోని గ్రామ్​పురా గ్రామంలో తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది. కేసు నమోదు చేసిన కొద్ది రోజుల్లోనే ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడ్ని అప్పటికే అరెస్ట్​ చేశామని వెల్లడించారు.

యూపీ రేప్​ కేసులో బాధితురాలు ఆత్మహత్య

బాహ్​జోయి పోలీసు స్టేషన్​ పరిధిలో మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది. జనవరి 27న ఓ వ్యక్తి తనను అత్యాచారం చేశాడని కేసు నమోదు చేసింది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. బాధితురాలు, నిందితుడు ప్రేమించుకున్నారు.

-సంభాల్​ జిల్లా ఎస్పీ చక్రేశ్​ మిశ్రా

బాధితురాలి మృతిపై ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సంభాల్​ జిల్లా ఎస్పీ చక్రేశ్​ మిశ్రా తెలిపారు.

ఇదీ చదవండి:'మహిళను అపహరించి 60 మంది అత్యాచారం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.