ETV Bharat / bharat

షాపింగ్​ మాల్​పై నుంచి జారిపడి యువతి మృతి.. ఏం జరిగింది?

Shopping Complex Incident: షాపింగ్​ కాంప్లెక్స్​కు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు యువతీయువకులు రెండో అంతస్తు నుంచి జారిపడిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. యువతి అక్కడిక్కడే మరణించగా.. యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shopping Complex Incident:
Shopping Complex Incident:
author img

By

Published : May 21, 2022, 10:51 PM IST

Shopping Complex Incident: కర్ణాటకలోని బెంగళూరు బ్రిగేడ్​ రోడ్డులో ఉన్న ఓ షాపింగ్​ కాంప్లెక్స్​కు వెళ్లిన ఇద్దరు యువతీయువకులు ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి జారి పడిపోయారు. ఈ సంఘటనలో యువతి అక్కడిక్కడే మృతి చెందగా.. యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం బ్రిగేడ్‌ రోడ్డులోని షాపింగ్‌ కాంప్లెక్స్‌కు మధ్యాహ్నం సమయంలో లియా, పీటర్​లు షాపింగ్​కు వెళ్లారు. మెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు రెండో అంతస్తు కిటికీ నుంచి లియా(20) కింద పడిపోయింది. తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. జారి పడిన లియాను రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితుడు పీటర్​ కూడా కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిటికీలకు గ్రిల్స్​ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

"మృతురాలు లియా.. ఫ్రేజర్‌ టౌన్‌లో నివాసం ఉంటోంది. యువకుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రిస్ పీటర్‌గా గుర్తించాం. అతడు నగరంలోని హెచ్‌ఏఎల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే, ఈ ఘటన వెనుక కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. " అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్​డీ శరణప్ప తెలిపారు.

ఇవీ చదవండి: 3 అడుగుల ట్రాక్టర్​.. 35 కి.మీ. మైలేజీ.. ఇంటర్​ విద్యార్థి అద్భుత ప్రతిభ

ప్రేమకు ఓకే.. పెళ్లికి నో.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడిని..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.