ETV Bharat / bharat

నలుగురి పిల్లల తల్లితో యువకుడి ప్రేమాయణం- ఇంటికి పిలిచి ప్రైవేట్​ భాగాలు కట్​ చేసిన లవర్​! - Mother Of Four Children Illegal Relation With Boy

Woman Cut Private Parts Of Her Lover : ప్రియుడి ప్రైవేట్​ భాగాలను కట్​ చేసింది నలుగురు పిల్లల తల్లి. తనను కలవడానికి ఇంటికి వచ్చిన అతడిపై ఈ దారుణానికి ఒడిగట్టింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ దారుణం.

Woman Cut Private Parts Of Her Lover In Kushinagar UP
Woman Cut Private Parts Of Her Lover In UP
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 1:14 PM IST

Updated : Dec 16, 2023, 1:38 PM IST

Woman Cut Private Parts Of Her Lover : నలుగురు పిల్లల తల్లితో ప్రేమాయణం సాగించాడు ఓ యువకుడు. కలవాలని ఉంది రమ్మంటూ ప్రియుడిని ఇంటికి పిలిచింది ఆ మహిళ. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగడం వల్ల ఆగ్రహించి అతడి ప్రైవేట్​ భాగాలను కత్తితో కొసేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఖుషీనగర్ జిల్లా​లో గురువారం రాత్రి జరిగింది. తీవ్ర రక్తస్రావంతో ఘటనాస్థలి నుంచి తప్పించుకున్న ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదీ జరిగింది
ఖడ్డా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో అదే ప్రాంతంలో ఉండే తన ప్రియుడికి ఫోన్​ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. దీంతో ఆ యువకుడు మహిళ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన వివాహిత ఇంట్లోని పదునైన కత్తితో అతడి ప్రైవేటు భాగాలను కట్​ చేసింది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయింది. అప్పటికే స్పృహలో ఉన్న బాధితుడు దగ్గర్లోని ఆస్పత్రికి పరుగులు తీశాడు. గాయం తీవ్రంగా ఉండడం వల్ల అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు అంటున్నారు.

ఉద్యోగరీత్యా మహిళ భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే యువకుడికి నలుగురు పిల్లల తల్లితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసిందని ఖడ్డా పోలీస్ స్టేషన్​ ఎస్‌హెచ్‌ఓ నీరజ్‌ రాయ్​ పేర్కొన్నారు. అతడు తరచూ మహిళ ఇంటికి వచ్చివెళ్లే వాడని చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించి రాతపూర్వకంగా ఫిర్యాదు అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

రేపిస్ట్​ మర్మాంగం కట్​!
సరిగ్గా నెలక్రితం కూడా ఇదే ఉత్తర్​ప్రదేశ్​లో అచ్చం ఇదే తరహా ఘటన వెలుగుచూసింది. కౌశాంబి జిల్లాలో తనపై అత్యాచారానికి పాల్పడేందుకు వచ్చిన ఓ యువకుడి ప్రైవేట్​ భాగాలను కోసేసింది ఓ మహిళ. అనంతరం వాటిని ఓ ప్లాస్టిక్​ కవర్​లో వేసుకొని నేరుగా పోలీస్​స్టేషన్​కు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

యువకుడి గొంతు కోసి, తుపాకీతో కాల్చి హత్య- కళ్లు పీకి మరీ!

తల్లి కోసం తల్లడిల్లిపోయిన చిన్నారి - జైలు వద్ద వెక్కివెక్కి ఏడుస్తూ ఎదురుచూపులు

Last Updated : Dec 16, 2023, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.