ETV Bharat / bharat

కుమార్తెపై కన్నేశాడని ప్రియుడి పురుషాంగం కోసేసిన మహిళ - యూపీ నేరాలు

కుమార్తెతో సంబంధం పెట్టుకొనేందుకు ప్రయత్నించిన ప్రియుడి పురుషాంగాన్ని కోసేసింది ఓ మహిళ. ఈ ఘటన యూపీలో జరిగింది. మరోవైపు, రాజస్థాన్​లో మైనర్​పై పలువురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Woman cut her lover genitals in Lakhimpur

author img

By

Published : Aug 17, 2022, 10:18 PM IST

UP crime news: ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రేమికుడి పురుషాంగాన్ని కోసేసింది. తన కుమార్తెతో అతడు లైంగిక సంబంధాలు పెట్టుకొనేందుకు యత్నించాడని మహిళ ఈ నేరానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే
కమలాపుర్​కు చెందిన హరిశంకర్.. మహేవగంజ్​లో ఉన్న తన బంధువులను తరచూ కలుస్తుండేవాడు. ఈ క్రమంలో అక్కడ ఉండే ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమకు దారితీసింది. ఈ బంధం అలా కొనసాగుతుండగా.. మహిళ కుమార్తెపై అతడు కన్నేశాడు. ఆమెతో సంబంధం పెట్టుకొనేందుకు ప్రయత్నించాడు. కొద్దిరోజుల తర్వాత ఈ విషయం అతడి ప్రేయసికి తెలిసింది.

దీంతో మహిళకు చిర్రెత్తుకొచ్చింది. హరిశంకర్​ను నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య తగాదా పెద్దదైంది. ఆ కోపంతో మహిళ.. హరిశంకర్ పురుషాంగాన్ని కోసేసింది. దీంతో అతడు రక్తస్రావంతోనే పోలీస్ స్టేషన్​కు వెళ్లాడు. పోలీసులు వెంటనే అతడిని మోతీపుర్​లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల హరిశంకర్​ను... లఖ్​నవూలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

హరిశంకర్ తరఫున అతడి కుటుంబ సభ్యులు మహిళపై పోలీస్ స్టేషన్​లో కేసు పెట్టారు. అయితే, మహిళ కుటుంబ సభ్యులు సైతం హరిశంకర్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసేందుకు యత్నించాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మైనర్​ కిడ్నాప్, గ్యాంగ్​రేప్..
రాజస్థాన్​లోని గోవర్ధన్ జిల్లాలో మైనర్​పై కొందరు యువకులు గ్యాంగ్​రేప్ చేశారు. బాలికను అపహరించుకొని వెళ్లిన దుండగులు.. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక(16) ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఎప్పటిలాగే బుధవారం స్కూల్​కు బయల్దేరింది.

అయితే, పొరుగున ఉండే గోవిందా, రాహుల్ సహా మరో వ్యక్తి.. బాలికను కిడ్నాప్ చేశారు. బైక్​పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఓ గెస్ట్ హౌస్​కు బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. గెస్ట్ హౌస్ నుంచి బాలిక అరుపులు రావడాన్ని స్థానికులు విని అక్కడికి చేరుకున్నారు. బాలికను కాపాడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు గోవర్ధన్​కు చేరుకొని.. పోలీసులను సంప్రదించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు.

హరియాణాలోనూ దారుణం..
కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడిన ఘటన హరియాణాలోనూ చోటుచేసుకుంది. నూహ్ జిల్లాలో మూడేళ్ల బాలికను అపహరించిన ఓ టీనేజీ బాలుడు.. అనంతరం అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసుకున్నారు.

ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం చిన్నారి తల్లి పొలానికి వెళ్లిన సమయంలో, చిన్నారి ఆమె వెంట వెళ్లింది. అయితే, తన వెంట కుమార్తె వస్తోందన్న విషయం తెలీక.. మహిళ వెనక్కి తిరగకుండా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ సమయంలోనే 14ఏళ్ల బాలుడు చిన్నారిని అపహరించుకుపోయాడు. ఆమెపై అత్యాచారం చేసి వదిలేశాడు. అనంతరం, బాలిక తండ్రి పొలానికి రాగా.. పాప ఏడుపులు వినిపించాయి. వెళ్లి చూడగా.. చిన్నారిని కింద పడిపోయి ఉంది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి.. పోలీసులను ఆశ్రయించాడు బాధితురాలి తండ్రి. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడిని అరెస్టు చేశారు. అతడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.